Renu Desai sensational remarks: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా సెలబ్రిటీస్ లో ఒకరు రేణు దేశాయ్(Renu Desai). ఈమె అప్పుడప్పుడు ఇన్ స్టాగ్రామ్ వేదికగా చేసే కొన్ని కామెంట్లు వివాదాలకు దారి తీస్తుంటాయి. ముఖ్యంగా ఈమె జంతుప్రేమికురాలు. జంతువుల పట్ల ఏ చిన్న హింస జరిగినా, ఏ చిన్న అన్యాయం జరిగినా శివంగి లాగా రెచ్చిపోతుంది. మూగ జీవాల కోసం ఎంత పెద్ద వారితో అయినా గొడవలు పడేందుకు సిద్ధం అవుతుంది. ఇప్పుడు ఈమె ఏకంగా సుప్రీమ్ కోర్టు తీర్పునే సవాలు చేస్తూ కాసేపటి క్రితమే ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సంచలనం గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే వీధి కుక్కలు కారణంగా జనాలు, చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని, అన్యాయంగా వీధి కుక్కలు గుంపుగా చేరి అనేక ప్రాంతాల్లో చిన్న పిల్లలను చెంపేస్తున్నాయని, అందుకే వీధి కుక్కలను చంపేయాలి అంటూ పెద్ద ఎత్తున ఒక డిమాండ్ ఈమధ్య కాలం లో కొనసాగుతోంది.
కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలను చంపేయడం కూడా మొదలు పెట్టారు. ఈ అంశంపై సుప్రీమ్ కోర్టు నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడం తో రేణు దేశాయ్ కి కోపం కట్టలు తెంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘చట్టం, న్యాయం అనేది ఇప్పుడు ఒక జోక్ అయిపోయింది. అందుకు నేనే ఒక ఉదాహరణ. వీధి కుక్కలు గురించి సుప్రీమ్ కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుని చూస్తుంటే, ఆయనకు కుక్కలు మీద ఎదో వ్యక్తిగత ద్వేషం ఉండి ఉండొచ్చు, ఇది మానవత్వం తో ఇచ్చిన తీర్పు కాదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఎక్కడో రెండు మూడు సంఘటనలు జరిగితే వీధి కుక్కలన్నిటినీ చంపేస్తారా?. కొంతమంది మగాళ్లు రే**ప్ చేస్తున్నారు, కొంతమంది మగాళ్లు హత్యలు చేస్తున్నారు, అలా అని మగవాళ్లందరినీ తప్పుబట్టి చంపేయాలా ఇప్పుడు? ఇదెక్కడి న్యాయం’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
నేను ఇలా మాట్లాడినందుకు నన్ను అరెస్ట్ చేసి జైలు లో పెట్టినా పెట్టొచ్చు, అన్నిటికీ సిద్దపడే ఇక్కడికి వచనంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. కుక్కలు వల్ల మనుషులు చనిపోతున్నారు అంటున్నారు, దోమకాటు వల్ల కూడా మనుషులు చనిపోవడం లేదా?, కేవలం కుక్కల వల్ల చనిపోతున్న మనుషులను మాత్రమే లెక్కలోకి తీసుకొని మూగ జీవాల ప్రాణాలను తీయడం ద్వంద్వ నీతి కాదా?, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు ప్రాణాలను రక్షించే విదంగా ఉండాలి కానీ, తీసే విధంగా ఉండకూడదు అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ వీధి కుక్కలు ఊచకోత వెనుక ప్రభుత్వాల వైఫల్యాలు ఉన్నాయి, వాటిని కప్పి పుచ్చుకోవడానికి మూగజీవాల ప్రాణాలు తీస్తున్నారంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ, న్యాయ వర్గాల్లో మంచి అలజడి ని రేపాయి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
మగాళ్లు రేప్ చేస్తారు… మగాళ్లు మర్డర్ చేస్తారు…
బుద్ధి వుందా కొంచెం…?#RenuDesai pic.twitter.com/0XiGy4pVEp
— M9 NEWS (@M9News_) January 19, 2026
