Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఆమె ఏం చేసినా కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఆమె జంతు సంరక్షణ కోసం విరాళాలను సేకరించింది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.
అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు ‘మీది కూడా మా అన్నలాగే గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్లైతే చేశారు. ఇక ఈ కామెంట్లకు ఆమె ఘాటుగా రిప్లై అయితే ఇచ్చింది. నేను ఏ పోస్ట్ పెట్టిన నా మాజీ భర్త అయిన పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తూ కామెంట్లు చేస్తూ ఉంటారు. నేను పది సంవత్సరాల నుంచి ఈ విరాళాలను సేకరిస్తున్నాను. ఇక దీనికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. అలాంటప్పుడు నేను ఏ పోస్ట్ పెట్టిన దానికి ఆయనతో పోల్చడం అనేది సరైన పద్ధతి కాదు అంటూ ఆమె చాలా ఘాటుగా రిప్లై ను అయితే ఇచ్చింది.
ఇక మొత్తానికైతే ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక బద్రి సినిమాతో పరిచయం అయిన వీళ్లిద్దరూ ఆ తర్వాత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆ తర్వాత వీళ్ళ మధ్య వచ్చిన కొన్ని విభేదాల కారణంగా ఇద్దరు విడిపోయి ఎవరికి వారు సపరేట్ గా బతుకుతున్నారు.
ఇక ఇలాంటి సమయంలో ప్రతిదానికి ఆమెను పవన్ కళ్యాణ్ తో పోల్చడం ఆమె ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురావడం చేస్తున్న అభిమానులందరికీ ఒకసారిగా ఆమె గట్టి కౌంటర్లైతే వేసింది. ఇక రేణు దేశాయ్ చేసిన పనికి పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతవరకు కంగుతిన్నారనే చెప్పాలి…ఇక మీదట ఇలాంటి కామెంట్లు చేయడానికి ఎవరూ సాహసం చేయరు…