Game Changer Movie: ప్రస్తుతం సౌత్ ఇండియా లో టాప్ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా తమన్ ఏ రేంజ్ డిమాండ్ తో ఇండస్ట్రీ లోకి దూసుకుపోతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రతీ నెల విడుదలయ్యే సినిమాలలో తమన్ హస్తం కచ్చితంగా ఉంటుంది. ఆ రేంజ్ డిమాండ్ తో కొనసాగుతున్న సంగీత దర్శకుడు ఆయన. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా ఆయన సంగీతం అందించిన ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలకు పబ్లిక్ టాక్ ఎలా ఉన్నా, తమన్ అందించిన సంగీతానికి మాత్రం బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి గూస్ బంప్స్ వచ్చాయని ఈ రెండు సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. ‘డాకు మహారాజ్’ కి అయితే ఒక థియేటర్ లో స్పీకర్స్ పేలిపోయాయి కూడా. అలాంటి సంగీతం అందిస్తూ టాప్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న తమన్ రీసెంట్ గా ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్ లో ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘సక్సెస్ కోసమే మేమంతా పని చేస్తాం..అందుకు నిర్మాతలు మాకు అన్ని విధాలుగా సహకరిస్తారు. కానీ రీసెంట్ గా సోషల్ మీడియా లో నడుస్తున్న ట్రోల్స్ ని చూసి భయమేస్తుంది. ఒక సినిమాని ట్రోల్స్ ని దాటి నిర్మాతల చేతుల్లో సక్సెస్ పెట్టడం మాకు అగ్ని పరీక్ష లాగా మారింది. బాగాలేని సినిమాలకు ఎలాగో ట్రోల్స్ చేస్తారు. బాగున్న సినిమాలను కూడా ట్రోల్స్ చేసి, వాటిని చంపేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఇప్పుడు నేను కూడా ఈ ట్రోల్స్ కి భయపడుతున్నాను. ఎదో ఒకరోజు నిర్మాతలు ఈ ట్రోల్స్ ని చూసి నాకు సినిమా ఆఫర్లు తగ్గిస్తారేమో అని భయం వేస్తుంది.’ అంటూ చాలా ఎమోషనల్ గా తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆయన ఇది ఏ సినిమాని ఉద్దేశించి అన్నాడో నేరుగా చెప్పకపోయినా, ‘గేమ్ చేంజర్’ ని ఉద్దేశించి అన్నాడని అర్థం అవుతుంది. నిజం చెప్పాలంటే గడిచిన పదేళ్లలో ఒక సినిమాకి ఈ రేంజ్ ట్రోల్స్ చూడడం కేవలం ‘గేమ్ చేంజర్’ విషయంలోనే జరిగింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు మరియు వైసీపీ పార్టీ ఫ్యాన్స్, అదే విధంగా వాళ్లకి సంబంధించిన మీడియా ‘గేమ్ చేంజర్’ పై నెగటివిటీ చేయడం లో జీతం తీసుకున్న ఉద్యోగులు లెక్క ప్రవర్తించారు. సినిమా వాళ్ళు ప్రచారం చేసినంత చెత్తగా అయితే లేదు. యావరేజ్ రేంజ్ లో ఉంది. కానీ టాక్ ప్రభావం అప్పటికే జనాల్లోకి బలంగా వెళ్ళింది. ఫలితంగా 400 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీసిన సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి చర్యలు చేయకుండా ప్రభుత్వాలే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి.