Renu Desai emotional comments: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో ఒకరు రేణు దేశాయ్(Renu Desai). మోడలింగ్ రంగం ద్వారా ఇండస్ట్రీ లోకి ‘బద్రి’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె , పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మాజీ భార్యగా ఎంతో పాపులారిటీ ని సంపాదించింది. అయితే సోషల్ మీడియా లో అప్పుడప్పుడు ఈమె చేసే కామెంట్స్ వివాదాలకు దారి తీస్తోంది. ఈమె వ్యవహారం చూస్తే , మనుషులకు దూరంగా, మూగ జీవాలకు దగ్గరగా బ్రతుకుతున్నట్టుగా అనిపిస్తోంది. ముఖ్యంగా కుక్కలను ఈమె చూసుకునేంత ప్రేమగా బహుశా ఎవ్వరూ చూసుకోరేమో. వాటికి చిన్న ఆపద కలిగినా ఈమె తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురి అవుతూ ఉంటుంది. వీధి కుక్కలు మనుషుల మీద దాడులు చేస్తున్నాయి, వాటిని చంపేయడాన్ని సమర్థిస్తూ సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు పై ఈమె పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె ప్రస్తుతం జరుగుతున్న అంశాలపైన మాత్రమే కాకుండా, తన వ్యక్తిగత విషయాలను కూడా కొన్ని పంచుకోగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమెకు మనుషుల మీద , వారి ప్రవర్తన మీద ఎంతటి విరక్తి కలిగిందో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో నాకు రక్షణ కరువైంది. నా వ్యక్తిగత గోప్యతను రక్షించుకోవడం చాలా కష్టంగా మారింది’ అంటూ చెప్పుకొచ్చింది. కొందరు ఆకతాయిలు చేసే కామెంట్స్ ని భరించలేక ఇప్పటికే ట్విట్టర్ నుండి వెళ్లిపోయానని , ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఒక పోస్ట్ చేసేటప్పుడు కామెంట్స్ ని ఆఫ్ లో పెట్టుకొని చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. అదే విధంగా తన ఆరోగ్య సమస్యలపై రేణు దేశాయ్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘అందరూ నన్ను అకస్మాత్తుగా అంత బరువు పెరిగిపోయావు ఏంటి అని అడుగుతున్నారు. నాకు గుండెలో చిన్న సమస్య ఉంది. అందుకు చికిత్స కోసం బీటా-బ్లాకర్స్ అనే మందులను వాడాల్సి వస్తోంది. ఆ మందుల కారణంగానే బరువు భారీగా పెరిగిపోయాను. ఈ మందుల కారణంగా శరీర జీవక్రియ బాగా మందగించింది. కానీ నాకు ఈ మందులు వాడడం అత్యవసరం కాబట్టి వాడక తప్పడం లేదు. ఈ బీటా బ్లాకర్స్ మందుల కారణంగా నా శరీరం బాగా ఉబ్బిపోయింది. ఆ తర్వాత కొన్ని నేచురల్ వైద్య విందాలపై మొగ్గు చూపి , శస్త్ర చికిత్స చేయించుకున్నాను. ఈ వైద్య ప్రక్రియ లు నా ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపించాయి. కానీ ఇప్పుడు పర్లేదు , చిన్నగా కోలుకుంటున్నాను. అంతే కాదు గతం లో నాకు అపెండిక్స్ సర్జరీ కూడా జరిగింది. అపెండిక్స్ వచ్చినప్పుడు నేను గమనించలేదు . కానీ అది కాలం పెరిగే కొద్దీ బాగా ముదిరిపోయింది. చివరి నిమిషం లో ఆసుపత్రి కి వెళ్లాను , ఆరోజు కొన్ని గంటలు ఆలస్యం అయ్యుంటే చనిపోయేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్ .