Renu Desai: రీసెంట్ గా తెలంగాణ లో ఒక సర్పంచ్ వీధి కుక్కలపై జనాలు ఫిర్యాదు చేయడం తో తమ గ్రామం లో ఉన్నటువంటి 500 వీధి కుక్కలను చంపించి, ఫోటోలు దిగడం పెద్ద సంచలనంగా మారింది. అంతే కాదు దేశవ్యాప్తంగా ఈ వీధి కుక్కల దాడులు జనాలపై ఎక్కువ ఉండడం తో సుప్రీం కోర్టు నుండి కూడా పాజిటివ్ తీర్పు వచ్చింది. దీంతో సుప్రీం కోర్టు తీర్పుని తప్పుబడుతూ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నిన్న హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి తన ఆవేదన వ్యక్తం చేసింది. వీధి కుక్కలను చంపకండి అని, మీకు మీ వీధిలో కుక్కలు ఎటాక్ చేస్తున్నాయి అనుకుంటే నాకు చెప్పండి, మా NGO తరుపున మనుషులు వచ్చి తీసుకెళ్తారు అంటూ చెప్పుకొచ్చింది.
ఇదే ప్రెస్ మీట్ లో ఆమె అనేక వ్యాఖ్యలు చేసింది. దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. మొదటి నుండి సోషల్ మీడియా లో వచ్చే నెగిటివ్ కామెంట్స్ ని తీసుకోలేని రేణు దేశాయ్, ఈసారి కూడా నెగిటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అవుతూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ ని అప్లోడ్ చేసింది. ఆమె మాట్లాడుతూ ‘రీసెంట్ గా నేను ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పై, నేను ఎలాంటి తప్పు మాట్లాడకపోయిన నన్ను కొంతమంది కావాలని టార్గెట్ చేసి తిడుతున్నారు. నన్ను కాపాడేందుకు మా అమ్మానాన్న, అన్నయ్య, భర్త ఎవ్వరూ లేరు. మీరు చేస్తున్న వ్యాఖ్యలపై తిరిగి నేను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వను. నా మనసులో మీ మాటల పట్ల చాలా బాధ ఉంది. ఆ బాధని నేను భగవంతుడి వద్ద మాత్రమే చెప్తాను. ఆయన నా ప్రార్థనలు వింటాడని నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నేను రెగ్యులర్ గా కాశీ కి ఎందుకు వెళ్తుంటానో ఈ పాటికే మీ అందరికీ అర్థం అయ్యి ఉంటుంది. నేను ఏ రోజు కూడా నా హక్కుల కోసం పోరాడలేదు. కానీ, నోరు లేని మూగజీవాలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోను. ఈ వీధి కుక్కల వ్యవహారాన్ని ఇక్కడితో వదిలే సమస్యే లేదు, పోరాటం చేస్తాను , కొన్ని కుక్కలు చేసిన తప్పు కారణంగా వందల కుక్కలను చంపేయాలని అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయాన్నీ మీరంతా అర్థం చేసుకునేవరకు నా పోరాటం ఆగదు’ అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఆ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ని మీరు కూడా చూసేయండి.
