Abu Dhabi India Relations: భారత్ ప్రపంచంలో చమురు వినియోగ దేశాల్లో రెండోస్థానంలో ఉంది. మొదటిస్థానంలో చైనా ఉంది. భారత్ 90 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. మూడేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా ఆయిల్ దిగుమతులు నిలిపవేశాయి. ఈ నేపథ్యంలో మిత్రదేశమైన రష్యాకు భారత్ అండగా నిలిచింది. మరోవైపు రష్య కూడా బహిరంగ మార్కెట్ కన్నా తక్కువ ధరకు ఇంధనం సరఫరా చేస్తోంది. అయితే దీనిని అమెరికా జీర్ణించుకోవడం లేదు. ఈ కరణంగానే అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు విధించారు. ఇంకా విధిస్తామని బెదిరిస్తున్నాడు. మరోవైపు వెనుజువెలా ఆక్రమణ నేపథ్యంలో రష్యాలోని షెల్ ఆయిల్‌ను భారత్‌కు సరఫరా చేయాలని ప్లాన్ వేస్తున్నాడు. ఈ క్రమంలో భారత్ వైవిధ్యమైన మార్గాలు అన్వేషిస్తోంది. ఇంధన భద్రతను బలోపేతం చేస్తోంది. తాజాగా యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ పర్యటన సందర్భంగా మోదీతో కీలక చర్చలు జరిపారు.
విదేశాల్లో సొంత ఉత్పత్తి..
వెనెజువెలాలోని ‘సాన్ క్రిస్టోబల్’ ప్రాజెక్టుల్లో ఓఎన్జీసీకి పెద్ద వాటాలు ఉన్నాయి. 600 మిలియన్ డాలర్ల లాభాలు చమురు రూపంలో అందుతాయి. కానీ అక్కడి ముదురో ప్రభుత్వం కూలిపోవడంతో ఇప్పుడు సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు గయానాలో 11 బిలియన్ బ్యారెళ్ల నిల్వల్లో ఓఎన్జీసీ, రిలయన్స్ 2026 వేలంలో పాల్గొని ఉత్పత్తి హక్కులు సాధించబోతున్నాయి.
రష్యా క్షేత్రాల్లోనూ ఉత్పత్తి..
రష్యాలో ఓఎన్జీసీకి సాఖాలిన్–1లో 20%, వాంకోర్ క్షేత్రంలో 26% వాటాలు. 2009లో టామ్సక్ ప్రాంతంలో ఇంపీరియల్ ఎనర్జీని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాజెక్టులు భారత ఇంధన అవసరాలకు స్థిరమైన మద్దతు.
అబుదాబిలో సొంత ఉత్పత్తి..
అబుదాబిలో బీపీసీఎల్, ఐవోసీ కలిసి ఃఉర్జా భారత్’ సంస్థ ఆన్‌షోర్ బ్లాక్–1లో చమురు కనుగొన్నాయి. తాజాగా ఎక్స్‌ఎన్–76 (షిలైఫ్) బావిలో తేలిక ముడి చమురు, ఎక్స్‌ఎన్–79 (హబ్షాన్)లో కొత్త నిక్షేపాలు లభించాయి. 6,162 చ.కి.మీ. విస్తీర్ణంలో 100% హక్కులతో పూర్తి ఉత్పత్తి అనుమతి. 2019 నుంచి సాగుతున్న అన్వేషణ దశ ముగిసి, భారీ పెట్టుబడులతో తవ్వకాలు మొదలయ్యాయి. యూఏఈ ఇంధన ఉత్పత్తిలో కూడా ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద భాగస్వామిగా మారింది.
సౌదీ సరఫరాలు, రష్యా–వెనెజువెలా–గయానా ప్రాజెక్టులు, అబుదాబి ఉత్పత్తి – ఇవి భారతాన్ని దిగుమత ఆధారాల నుంచి స్వావలంబన వైపు నడిపిస్తున్నాయి. అమెరికా ఒత్తిడికి భారత్ స్వయం సమృద్ధి మార్గం ఎంపిక చేసుకుంది.
