Tollywood Actress: ‘మిల్క్ బ్యూటీ’ అంటూ ఇన్నాళ్లు ప్రమోట్ అయిన తమన్నాకి ప్రస్తుతం అవకాశాల్లేక, ఫేడ్-అవుట్ అయ్యే స్థితిలో ఉంది. అందుకే, తన రేటును అమాంతం తగ్గించేసి రోజుల లెక్క తీసుకుంటుంది. ఇప్పుడు అదే దారిలో మరో హీరోయిన్ మేఘ ఆకాష్ కూడా చేరింది. పారితోషికం అనే కాన్సెప్ట్ నుంచే సగర్వంగా బయటకొచ్చేసి.. రోజుకు ఇంత ఇవ్వండి అంటూ డెయిలీ పేమెంట్స్ విధానంలోకి వచ్చింది మేఘ. నిజానికి మేఘ ఆకాష్ స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. అమ్మడులో ఆ రేంజ్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. కానీ.. టాలెంట్ కి తగ్గ స్టార్ డమ్ రాలేదు.

చాన్నాళ్లుగా మేఘ ఆకాష్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. కానీ, ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా పెద్ద సినిమా ఆఫర్లు రాలేదు. ఆమధ్య ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చినా.. చేయడానికి మొహమాట పడింది. ఇప్పుడు మేఘ ఆకాష్ కు ఆ ఐటమ్ అవకాశాలు కూడా ఆల్ మోస్ట్ అడుగంటాయి. దీంతో, పారితోషికం ఇచ్చి, ఛాన్స్ ఇచ్చే వాడే లేకుండా పోయాడు.
Also Read: Major Trailer: ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా మేజర్ ట్రైలర్
అందుకే, కాల్షీట్ పేమెంట్ సెట్ చేసుకుని ఆ దిశగా ముందుకు వెళ్తుంది. ఇదే క్రమంలో ఇక నుంచి హీరోయిన్ రోల్ అయినా, అతిధి పాత్ర అయినా, ఏదైనా కాల్షీట్ లెక్కన మేఘ ఆకాష్ కు పారితోషికాన్ని సమర్పించుకోవాల్సి ఉంటుంది. హీరోయిన్ గా ఉన్నప్పుడు సినిమాకు 35 లక్షల వరకు అందుకుంది. ప్రస్తుతం డెయిలీ పేమెంట్స్ లో భాగంగా.. రోజుకు లక్ష రూపాయల వరకు అడుగుతుంది.

అది కూడా సినిమాని బట్టే ఉంటుంది. సంపాదన సంగతి పక్కనపెడితే.. లైమ్ లైట్ లో ఉండటమే మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్నట్టు ఉంది మేఘ ఆకాష్. అద్భుతమైన నటన ఉన్నా.. హీరోయిన్ గా నిలదొక్కు లేకపోవడానికి ముఖ్య కారణం మేఘ ఆకాషే. ఎందుకంటే, మిగతా హీరోయిన్లలా ఆమె ఫొటో షూట్లు చేయదు. ఇతర హీరోయిన్లలా ఓపెనింగ్స్, సోషల్ మీడియాలో ప్రమోషన్లు కూడా తక్కువే.

కాబట్టి ఇన్నాళ్లు మేఘ ఆకాష్ కు అరకొర ఆఫర్లే వచ్చాయి. ఎంతొస్తే అంత అన్నట్టుగా బండి లాగించేస్తోంది. ఏమిటో పాపం.. తన అందాలతో అబ్బా అనిపించాల్సిన ఈ బ్యూటీ, ఛాన్స్ లు లేక విలవిల్లాడిపోతోంది. మరి రానున్న రోజుల్లో అయినా ‘మేఘ ఆకాష్’ ఫామ్ లోకి రావాలని ఆశిద్దాం.
Also Read:Mahesh Babu- Rajasekhar: రాజశేఖర్ మహేష్ సినిమాలో కన్ఫర్మ్.. దశ తిరుగుతుందా !
Recommended Videos