https://oktelugu.com/

Old TV Anchors: ఒక‌ప్ప‌టి ఈ బుల్లితెర యాంక‌ర్స్ గుర్తున్నారా.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..

Old TV Anchors: ఒక షో పెద్ద హిట్ అవ్వడానికి కాన్సెప్ట్ ఎంత ముఖ్య‌మో.. అందులో యాంక‌ర్ కూడా అంతే ముఖ్యం. కాన్సెప్ట్ బాగుండి యాంక‌ర్ ఫ‌ర్మామెన్స్ బాగాలేక ఎన్నో షోలు అట్ట‌ర్ ప్లాప్ అయిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే అసలు కాన్సెప్ట్ లేని షోల‌ను కూడా యాంక‌ర్స్ త‌మ ఫ‌ర్మామెన్స్ తో పాపుల‌ర్ షోగా పేరుగాంచిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అడ‌పాద‌డ‌పా షోల‌లో మెరుస్తూ స్టార్ యాంక‌ర్ గా తెలుగులో ఎంతో మంది పాపుల‌ర్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 27, 2022 / 08:57 AM IST
    Follow us on

    Old TV Anchors: ఒక షో పెద్ద హిట్ అవ్వడానికి కాన్సెప్ట్ ఎంత ముఖ్య‌మో.. అందులో యాంక‌ర్ కూడా అంతే ముఖ్యం. కాన్సెప్ట్ బాగుండి యాంక‌ర్ ఫ‌ర్మామెన్స్ బాగాలేక ఎన్నో షోలు అట్ట‌ర్ ప్లాప్ అయిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే అసలు కాన్సెప్ట్ లేని షోల‌ను కూడా యాంక‌ర్స్ త‌మ ఫ‌ర్మామెన్స్ తో పాపుల‌ర్ షోగా పేరుగాంచిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అడ‌పాద‌డ‌పా షోల‌లో మెరుస్తూ స్టార్ యాంక‌ర్ గా తెలుగులో ఎంతో మంది పాపుల‌ర్ అయ్యారు. ఇప్ప‌టికీ కొంద‌రు ఏదో ఒక షోలో అల‌రిస్తుంటే కొంత మంది మాత్రం క‌న‌బ‌డ‌కుండా పోయారు. వారి గురించి ప్ర‌స్తుతం తెలుసుకుందా.

    ప్ర‌గ‌తి... అప్ప‌ట్లో ఈ టీవిలో తొమ్మిదింటికి వ‌చ్చే న్యూస్ రీడ‌ర్.. ఈమెకి అప్ప‌ట్లో చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. తొమ్మిది కాగానే టీవీలు ఆన్ చేసి చూసేవారు. కొంద‌రు న్యూస్ కోసం చూస్తే మ‌రికొంద‌రు ప్ర‌గ‌తి కోస‌మే చూసేవారు అంటే ప్ర‌గ‌తి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. మంచి వాయిస్, అందం అభిన‌యంతో ఆక‌ట్టుకునేవారు. కాగా ఎందుకో ఇప్పుడు న్యూస్ రీడ‌ర్ గా క‌న‌ప‌డ‌టంలేదు.

    Pragathi

    మైథిలి… ఈవిడ జెమినిలో వ‌చ్చే న్యూస్ కి ఫేమ‌స్.. పేరు పెద్ద‌గా తెలియ‌క‌పోయినా ఫేస్ చూస్తే.. వాయిస్ వింటే వెంట‌నే గుర్తుప‌డ‌తారు. న్యూస్ రీడ‌ర్ గానే కాకుండా కొన్ని షోల‌కు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చేవారు. అలాగే అడ్వ‌ర్టైజ్ మెంట్స్ కి వాయిస్ ఇచ్చేవారు. అయితే ఈవిడ కూడా బుల్లితెర పై ప్ర‌స్తుతం క‌నిపించ‌డం లేదు.

    Mythili

    అనితా ఆప్టే… ఈవిడ జెమిని టీవిలో బిగినింగ్ లో కొన్ని షోల‌కి యాంక‌ర్ గా చేస్తూ మ‌రికొన్ని షోస్ కి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చేవారు. మంచి వాయిస్.. మాడ్యులేష‌న్.. డెడికేష‌న్ అనిత స్పెష‌ల్. అయితే భ‌ర్త హేమంత్ ఆప్టేతో క‌లిసి కొన్ని షోల‌ను ప్రొడ్యూస్ చేస్తున్నా ప్ర‌స్తుతం యాంక‌రింగ్ కు దూరంగా ఉంటోంది.

    Anitha Apte Gemini

    అనుప‌మా... అప్ప‌ట్లో లైవ్ షోల‌న్నింట్లో అట‌కావాలా…పాట‌కావాలా.. షో మ‌స్తు పాపుల‌ర్ అయింది. ఆ షోను ఈ అనుమ‌ప‌మే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించేవారు. అప్ప‌ట్లో సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం ఈ షోను ఎంచుకునేవారు అంటే మామూలు విష‌యం కాదు. అలాగే కొత్త సినిమా గురూ.. అనే సినిమా రివ్యూ షోని కూడా అనుప‌మే హోస్ట్ గా చేసేవారు. అయితే ప్ర‌స్తుతం ఈ స్టార్ యాంక‌ర్ అనుప‌మా ఎక్క‌డుందో కూడా తెలియ‌దు.

    Also Read: Nidhhi Agerwal: పాపం ‘పవన్’ హీరోయిన్ ని అందరూ వదిలేస్తున్నారు !

    Anupama

    మ‌ల్లికా… జెమిని టీవి స్టార్ట్ అయిన కొత్త‌లో కొన్ని ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా చేసేవారు మ‌ల్లికా. అలాగే వెంక‌టేష్ బాబు న‌టించిన క‌లిసుందా రా.. మూవీలో.. మ‌హేశ్ బాబు న‌టించిన రాజ‌కుమారుడు సినిమాలో న‌టించారు. అలాగే కొన్ని సీరియ‌ల్స్ లో కూడా న‌టించి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే మ‌ల్లికా రీసెంట్గా చ‌నిపోయారు.

    Mallika

    గాయ‌త్రి భార్గ‌వి… ఆట‌కావాలా.. పాట‌కావాలా.. షోకి అనుప‌మ త‌ర్వాత గాయ‌త్రి భార్గ‌వి హోస్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే సినిమాలు, సీరియ‌ల్స్ లో న‌టిస్తూ బిజీగా మారిపోయారు. అయితే అప్పుడ‌ప్పుడు కొన్ని సినిమాల్లో, ఆడియో పంక్ష‌న్లో హోస్ గా మెరిసినా పూర్తి స్థాయి షోలు చేసి చాలాకాల‌మే అయింది.

    Anchor Gayatri Bhargavi

    జాహ్న‌వి... జెమిని టీవిలో వ‌చ్చిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ షో ద్వారా ప‌రిచ‌య‌మైన జాహ్న‌వి చాలా షోస్ కి యాంక‌రింగ్ చేసింది. అలాగే య‌జ్ఞం.. ర‌ణం వంటి సినిమాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం ఈ క్యూట్ స్టార్ ఎక్క‌డా క‌నిపించ‌డంలేదు.

    Jahnavi

    కీర్తీ... యూవ‌ర్స్ ల‌వింగ్లీ.. నీ కోసం ప్రోగ్రామ్స్ తో చాలా పాపుల‌ర్ అయింది కీర్తి. అలాగే జెమిని టీవీ, తేజ టీలో చాలా ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా చేసింది. కాగా రీసెంట్ గా టీవీ5లో ఒక ప్రోగ్రామ్ హోస్ట్ చేసిన కీర్తి త‌ర్వాత పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

    Keerthi

    లిఖిత కామిని… జెమిని టీవీ ఇంట్ర‌డ్యూస్ చేసిన యాంక‌ర్ల‌లో టాలెంటెడ్ లిఖిత కామిని. త‌ర్వాత కొన్ని షోస్ చేసి సినిమాల్లో, సీరియ‌ల్ల‌స్ లో న‌టించింది. అయితే ప్ర‌స్తుతం యాంక‌రింగ్ చేయ‌డం లేదు.

    likhitha kamini

    చిత్ర‌లేఖ‌... ఈ టీవీలో శివ‌రంజ‌నితో ఎంట్రీ ఇచ్చిన చిత్ర‌లేఖ మా ఊరి వంట ప్రోగ్రామ్ తో బాగా పాపుల‌ర్ అయింది. తెలుగు ను అన‌ర్గ‌లంగా మాట్లాడే వాళ్ల‌లో చిత్ర‌లేఖ ఒక‌రు. రీసెంట్ గా దూర‌ద‌ర్శ‌న్ లో తెలుగింటి అమ్మాయి అని ఒక తెలుగు ప్రోగ్రామ్ కి యాంక‌గా చేశారు.

    Chitralekha

    ర‌జిని... అదిత్య టీవీలో యాంక‌ర్ గా ప‌రిచ‌య‌మై కొన్ని సినిమాల్లో, సీరియ‌ల్స్లో కూడా న‌టించింది ర‌జిని. ప్ర‌స్తుతం ర‌జిని పెద్ద‌గా లైమ్ లైట్ లో లేదు.

    Rajani

    జ‌యంతి…జెమిని మ్యూజిక్ తో బాగా పాపుల‌ర్ అయిన యాంక‌ర్స్ లో జ‌యంతి ఒక‌రు. అదిత్యా టీవీలో నైట్ ప‌దింటికి వ‌చ్చే వెన్నెలా షోకి దాదాపు 10 ఇయ‌ర్స్ యాంక‌రింగ్ చేశారు. కాగా ప్ర‌స్తుతం ఏ షోలు క‌నిపించ‌డం లేదు.

    Jayathi

    Also Read: Ileana: ఓహో.. ఇలియానా పెళ్లి.. ఘనంగా ఏర్పాట్లు !

    Recommended Videos:

    Tags