Entertainment Programs On ETV: అధికారికంగా రికార్డింగ్ డాన్సులు బ్యాన్ చేశారు. కానీ పబ్లిక్ ఫ్లాట్ ఫార్మ్ లో ఈటీవీ నేరుగా ప్రసారం చేస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో నిషేధం ఉన్న రికార్డింగ్ డాన్సులను ఈటీవి కార్యక్రమాల్లో ప్రసారం చేస్తూ ఎంటర్టైన్మెంట్ పేరుతో వల్గర్ కంటెంట్ కి తెరలేపుతున్నారు. ఒకప్పుడు క్లీన్ ఇమేజ్ కలిగిన ఈటీవి బాగా దిగజారిపోయింది. టీఆర్పీ పాకులాటలో విలువలు వదిలేసింది. జనాల నుండి ఆదరణ వస్తుందా లేదా అనేది మాత్రమే పరిగణలోకి తీసుకొని కంటెంట్ ని పట్టించుకోవడం మానేశారు.

కండక్టర్ జాన్సీతో మొదలుపెట్టి నెల్లూరు కవిత వరకు వచ్చారు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ ఛానల్ గా ఈటీవి ఉండేది. పాడుతా తీయగా వంటి క్లాసిక్ షో దాని సొంతం. ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలు దాదాపు క్లీన్ ఇమేజ్ కలిగి ఉండేవి. జబర్దస్త్ రాకతో దానికి గండి పడింది. ఆ షో ప్రారంభంలో తీవ్ర విమర్శల పాలైంది. దారుణమైన డబుల్ మీనింగ్ అడల్ట్ జోక్స్ తో కూడిన స్కిట్స్ ప్రసారమయ్యాయి. దీంతో సర్వత్రా విమర్శలు తలెత్తాయి. ఈ క్రమంలో కొంచెం తగ్గి జోక్స్ లో వల్గారిటీ లేకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే యాంకర్స్ స్కిన్ షో చేయడం కూడా ఆ షోతోనే ప్రారంభమైంది.
జబర్దస్త్ బ్యాచ్ ఈటీవి ప్రతి షోలో ఎంట్రీ ఇవ్వడం వాటిని కొత్తగా రూపొందించడం చేస్తున్నారు. డాన్స్ రియాలిటీ షో ఢీ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. రష్మీ, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ఢీకి వచ్చాక డాన్స్ కాన్సెప్ట్ మైనర్ అయిపోయి రొమాన్స్, కామెడీ మేజర్ అయ్యింది. ఆ ఫార్ములా సూపర్ సక్సెస్ కావడంతో అదే ఫాలో అవుతున్నారు. ఇక ఢీ-జబర్దస్త్ మిక్స్ చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ పేరుతో కొత్త షో ప్రారంభించారు. యాంకర్స్, కమెడియన్స్, డాన్సర్స్ అందరూ కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ నిర్వహిస్తున్నారు.

ఈ వేదికగా కొందరు లోకల్, సోషల్ మీడియా టాలెంట్స్ ని పరిచయం చేస్తున్నారు. అంత వరకూ ఓకే. కానీ ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ రికార్డింగ్ డాన్సులకు అడ్డాగా మారింది. ఝాన్సీ అనే లేడీ కండక్టర్ తిరునాళ్ళు, ఈవెంట్స్ లో డాన్స్ షోలు చేస్తూ ఉంటారు. ఆమె యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యారు. దీంతో ఆమెకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఛాన్స్ ఇచ్చారు. పల్సర్ బైక్ సాంగ్ కి ఆమె పెర్ఫార్మన్స్ బాగా పాపులర్ అయ్యింది. ఆ ఎపిసోడ్ కి రికార్డు టీఆర్పీ దక్కింది. దీంతో శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఆమెను వదలడం లేదు. ఆమెకు పోటీగా మరో డాన్స్ సంచలనం నెల్లూరు కవితను రంగంలోకి దించారు. లేటెస్ట్ ఎపిసోడ్లో ఇద్దరి మధ్య రసవత్తర పోటీకి తెరలేపారు. నెల్లూరు కవిత, కండక్టర్ ఝాన్సీ తమ తమ టీమ్స్ తో దుమ్ము రేపారు. వాళ్ళ పెర్ఫార్మన్స్ నిషిద్ధ రికార్డింగ్ డాన్సులు తలపించాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి.