Ustaad Bhagat Singh Hindi Dubbing Rights: టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతం లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి అప్పట్లోనే 63 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టి సంచలనం సృష్టించింది.మళ్ళీ 11 ఏళ్ళ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రం తెరకెక్కుతుంది.
ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ గ్లిమ్స్ ఈమధ్యనే విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. మొదటి షెడ్యూల్ కి సంబంధించిన షాట్స్ ని కట్ చేసి ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే రేంజ్ లో కట్ చెయ్యబడిన ఈ గ్లిమ్స్ వీడియో కి సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది. 20 మిలియన్ కి పైగా వ్యూస్ ని రప్పించుకొని యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్న ఈ గ్లిమ్స్ వీడియో కోట్ల రూపాయిల బిజినెస్ చేస్తుంది.
మొన్నీమధ్యనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి కలిపి వంద కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తామని ఒక ప్రముఖ నిర్మాత ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ వార్త సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసింది.
ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ చిత్రానికి సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్స్ ని ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి సంబంధించిన సంస్థ 30 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇది డబ్బింగ్ సినిమాలలో ఆల్ టైం రికార్డు నెంబర్ అని చెప్పొచ్చు. ఇదంతా కేవలం గ్లిమ్స్ వీడియో ని చూసి జరుగుతున్న బిజినెస్ అని, ఇక రాబొయ్యే రోజుల్లో వచ్చే ప్రమోషనల్ కంటెంట్ కి ఇక హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు అని అంటున్నారు అభిమానులు.