https://oktelugu.com/

Leaked Movie Secenes: ‘పుష్ప’, ‘సర్కారు’ లీకుల పరిస్థితేంటి ?

కాలం మారుతుంది, అందుకు అనుగుణంగా సినిమా ప్రమోషన్స్ కూడా మారుతున్నాయి. ఇప్పటి ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఉండాలి. సినిమాకి సంబంధించి ప్రతి విషయంలో అలాంటి సర్ ప్రైజ్ లు ప్లాన్ చేసే అవకాశం ఉండదు. అందుకే మేకర్స్ ప్రమోషన్స్ కోసం ఎన్నో ఎత్తులను, మరెన్నో ఎత్తుగడలు వేయాల్సి వస్తోంది. అప్పుడప్పుడు దొంగ ప్రమోషన్స్ ను కూడా ప్లాన్ చెయ్యక తప్పడం లేదు. దొంగ ప్రమోషన్స్ అంటే.. తమ సినిమాకి సంబంధించి పోస్టర్స్ ను మేకింగ్ వీడియోలను ఆయా […]

Written By:
  • admin
  • , Updated On : August 14, 2021 / 10:28 AM IST
    Follow us on

    కాలం మారుతుంది, అందుకు అనుగుణంగా సినిమా ప్రమోషన్స్ కూడా మారుతున్నాయి. ఇప్పటి ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఉండాలి. సినిమాకి సంబంధించి ప్రతి విషయంలో అలాంటి సర్ ప్రైజ్ లు ప్లాన్ చేసే అవకాశం ఉండదు. అందుకే మేకర్స్ ప్రమోషన్స్ కోసం ఎన్నో ఎత్తులను, మరెన్నో ఎత్తుగడలు వేయాల్సి వస్తోంది. అప్పుడప్పుడు దొంగ ప్రమోషన్స్ ను కూడా ప్లాన్ చెయ్యక తప్పడం లేదు.

    దొంగ ప్రమోషన్స్ అంటే.. తమ సినిమాకి సంబంధించి పోస్టర్స్ ను మేకింగ్ వీడియోలను ఆయా సినిమాల నిర్మాతలు, హీరోలు, దర్శకులు లీక్ చేయడం అన్నమాట. ప్రేక్షకులు కూడా ఫలానా స్టార్ సినిమా వీడియో లీక్ అయింది అనగానే ఆసక్తిగా చూపిస్తారు. అందుకే, మేకర్స్ కూడా పబ్లిసిటీలో భాగంగా ఈ మధ్య ఇలాంటి ప్రమోషన్స్ ను ఎక్కువగా చేస్తోన్నట్లు తెలుస్తోంది.

    రెండు పెద్ద సినిమాల విషయంలో ఈ అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ టీజర్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఒక సూపర్ స్టార్ సినిమా టీజర్ అంత ఈజీగా ఎలా లీక్ అవుతుంది ? పైగా పుట్టినరోజు నాడు ఉదయం పూట విడుదల చేయాలనుకున్న టీజర్.. అదే రోజు అర్ధరాత్రి ఎలా లీక్ అయి ఉంటుంది ?

    ఆ సినిమా టీమ్ కి తెలియకుండా లీక్ అయ్యే అవకాశమే లేదు. ఇక ‘పుష్ప’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమా పాట కూడా రిలీజ్ రోజు రాత్రి బయటకు వచ్చింది. ఈ రెండు లీక్స్ ను గమనిస్తే.. మేకర్సే ఈ లీక్ ల ప్రోగ్రామ్ పెట్టారనిపిస్తోంది. ఎందుకంటే.. మేకింగ్ వీడియోలో లేక ఫోటోలో లీక్ అవ్వొచ్చు, కానీ లీక్ అయింది టీజర్, సాంగ్.

    ఈ రెండు కేవలం టీమ్ నుంచో లేక డైరెక్టర్ టీం నుంచో లీక్ అవ్వాలి. వాళ్ళు లీక్ చేసి కెరీర్ నాశనం చేసుకోరు. కాబట్టి అధికారికంగానే లీక్ అయి ఉండొచ్చు.