Prabhas Spirit New Look: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో , ప్రభాస్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో ప్రస్తుతానికి ‘స్పిరిట్’ చిత్రం మీద ఉన్నటువంటి అంచనాలు , ఏ సినిమా మీద కూడా లేవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ లాంటి కల్ట్ డైరెక్టర్, ప్రభాస్ లాంటి యాక్షన్ హీరో తో, పూర్తి స్థాయి పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ తీస్తున్నాడు అంటే , ఆ మాత్రం క్రేజ్ ఉండడం లో ఆశ్చర్యం లేదు. ఇకపోతే ఈ చిత్రంలో ప్రభాస్ ఏకంగా మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడట. ఈ న్యూ ఇయర్ కి శరీరం నిండా గాయాలతో, చేతిలో మందు బాటిల్ ని పట్టుకున్న ప్రభాస్ ని మీరంతా చూశారు. త్వరలోనే జైలు బట్టల్లో గుండు లుక్ లో ఉన్న ప్రభాస్ లుక్ ని కూడా చూడబోతున్నారట.
ఈ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యినట్టు తెలుస్తోంది. అదే విధంగా రీసెంట్ గా ప్రభాస్ పంచెకట్టు లో కళ్ళజోడు ధరించి స్టైల్ గా నడుచుకుంటూ వచ్చే ఫోటో ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ఇది రీసెంట్ గా హైదరాబాద్ లో తెరకెక్కించిన సన్నివేశాలకు సంబంధించిన ఫోటో అని అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇది AI ద్వారా జెనెరేట్ చేయబడిన ఫోటో అని , కానీ ప్రభాస్ లుక్ ఈ చిత్రం లో ఇలాగే ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్నాడని, రీసెంట్ గా అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో ప్లాన్ చేయలేదని కొంతమంది అభిమానులు అంటున్నారు. వీటిల్లో ఏది నిజం అనేది తెలియాలంటే , స్వయంగా సందీప్ వంగ స్పందించాల్సిందే. ఇప్పటికే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5 న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ప్లాన్ చేసిన విడుదల తేదీ ప్రకారమే షూటింగ్ షెడ్యూల్స్ ని నిర్వహించి , ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న తేదిలోనే విడుదల చెయ్యాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ షెడ్యూల్స్ అనుకున్న స్థాయిలో వేగంగా సాగకపోతే, వచ్చే ఏడాది డిసెంబర్ కి ఈ సినిమా షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిప్తి దిమిరి నటిస్తుండగా, విలన్స్ గా వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య మీనన్ నటిస్తున్నారు. రీసెంట్ గానే వీళ్లిద్దరి మీద కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. తదుపరి కొత్త షెడ్యూల్ ని డెహ్రాడూన్ లో ప్లాన్ చేశారట. ప్రస్తుతానికి విదేశాల్లో ప్రభాస్, ఇండియా కి తిరిగి రాగానే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.
