Prabhas Tears: ప్రభాస్ పెద్ద దిక్కు కోల్పోయారు. వరసకు పెదనాన్న అయిన కృష్ణంరాజు ప్రభాస్ కి గురువు, మార్గదర్శకుడు. కృష్ణంరాజు తన నటవారసుడిగా ప్రభాస్ ని ప్రకటించారు. ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయం చేశాడు. ప్రభాస్ ఎదుగుదలలో తనవంతు పాత్ర పోషించాడు. తండ్రి కంటే మిన్నగా కృష్ణంరాజును ప్రభాస్ భావించారు. ఆయన కూడా కొడుకు కంటే ఎక్కువగా ప్రభాస్ ని ఆదరించారు. అంతటి ఘాడమైన బంధం వాళ్ళ మధ్య ఉండేది. అన్నీ తానై నడిపించిన పెదనాన్న ఇక లేడన్న నిజాన్ని ప్రభాస్ జీర్ణించుకోలేకున్నాడు. నిశ్చలంగా పడివున్న కృష్ణంరాజు పార్థివ దేహం చూసి ప్రభాస్ తట్టుకోలేకపోతున్నాడు.

కృష్ణంరాజు మరణానికి ప్రభాస్ కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. పార్థీవ దేహం పక్కనే నిల్చొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందరు ఓదార్చినా ఆయన దుఃఖం ఆగడం లేదు. పెదనాన్న కోసం కన్నీరు మున్నీరవుతున్న ప్రభాస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్నపిల్లాడిలా ప్రభాస్ ఏడవడం అందరినీ కలచి వేస్తుంది. ఈ సంఘటన ప్రభాస్ సున్నితమైన మనసుకు అద్దం పడుతుంది. ప్రభాస్ ని ఆ స్థితిలో చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ప్రభాస్ కి భగవంతుడు మనో ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు.
చివరి శ్వాస వరకు కృష్ణంరాజు నటనకే జీవితం అంకితం చేశారు. నటుడిగా ఆయన చివరి చిత్రం రాధే శ్యామ్. ప్రభాస్ నటించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో కృష్ణంరాజు పరమహంస పాత్ర చేశారు. ప్రభాస్ తో కలిసి నటించడం ఇష్టపడే కృష్ణంరాజు మూడు సినిమాలు చేశారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బిల్లా, రెబల్, రాధే శ్యామ్ చిత్రాల్లో కృష్ణంరాజు నటించారు. రాధే శ్యామ్ మూవీలో జస్ట్ క్యామియో రోల్ చేసిన ఆయన బిల్లా, రెబల్ చిత్రాల్లో ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు.

ఇక ప్రభాస్ కి పెళ్లి చేయాలి, అతని పిల్లలతో కూడా నటించాలని కృష్ణంరాజు చాలా ఆశపడ్డారు. ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. గత పదేళ్లుగా ప్రభాస్ వివాహం చేయాలని కృష్ణంరాజు ప్రయత్నాలు చేస్తున్నారు. వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ మాత్రం పెళ్లిని పక్కన పెట్టేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ కృష్ణంరాజు మృతికి సంతాపం ప్రకటించారు. చిత్ర ప్రముఖులు నివాళులు అర్పించారు.
Never in my wildest dreams, I thought I would see him like this 😭
This feels so personal 💔Stay strong #Prabhas anna 🥺😭 pic.twitter.com/k1Jgy82947
— SALAAR 🏹 (@bhanurockz45) September 11, 2022