SP Balasubramanyam: గాన గంధర్వుడు బాల సుబ్రమ్మణ్యం సంగీత ప్రపంచానికి రారాజు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన మనమధ్య లేకపోయినా ఆయన గుర్తులు చాలా ఉన్నాయి. ఆయన పాడిన పాటలు ఎప్పుడు విన్నా మనసుకు ఉల్లాసాన్నిస్తాయి. సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువ పాటలు పాడిన ఘనత బాలుకే దుక్కుతుంది. యాభై ఏళ్ల బాలు సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లు దాటాడు. అయితే ఆయన ఎన్నడూ వివాదాస్పదుడిగా మారలేదు. కానీ తెలుగు హీరో సూపర్ స్టార్ కృష్ణ, బాలసుబ్రహ్మణ్యం మధ్య ఓ చిన్న మాట ద్వారా రెండేళ్లపాటు ఎడబాటం వచ్చింది. అంతేకాకుండా కృష్ణ సినిమాలకు బాలు పాటలు పాడలేదు. అయితే వీరిద్దరి మధ్య గొడవకు కారణమేంటి..? ఆ తరువాత మళ్లీ కలిసి పనిచేశారా..? ఇప్పుడు చూద్దాం.

బాలసుబ్రహ్మణ్యం తెలుగులో వందలకొద్దీ సినిమాలకు పాటలు పాడారు. ఇందులో కృష్ణ సినిమాలకు కూడా గానం వినిపించారు. ఆయన హీరోగా చేసిన ‘నేనంటే నేనే’ సినిమాకు బాలు తొలిసారిగా మొత్తం పాటలు పాడారు. ఆ సినిమా సూపర్ హిట్టు కావడంతో ఆ తరువాత తన ప్రతీ సినిమాలో బాలుతో పాడించేవారు. అయితే కొన్నాళ్ల పాటు వీరి మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతున్న సమయంలో ఓ విషయంలో మనస్పర్థలు వచ్చాయి. ఓ సినిమా పారితోషికం విషయంలో నిర్మాత..బాలుకు ఓ రకంగా చెబితే.. దానిని బాలు.. కృష్ణకు మరోరకంగా చెప్పాడు. దీంతో కృష్ణకు కోపం వచ్చింది. దీంతో బాలు చెప్పబోతుండగా కృష్ణ వినలేదట. ‘మీరు పాడకపోతే నా సినిమాలు సక్సెస్ అవ్వవా..?’ అని అన్నారట. దీంతో బాలు ‘మీకు పాడకపోయినా నేను ఎలాగోలా బతుకగలను’ అని అన్నాడట.
దీంతో రెండేళ్లపాటు వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే కొన్నాళ్ల తరువాత మళ్లీ బాలు, కృష్ణ ఎలా కలిశారో.. బాలు ఓ సందర్భంలో మీడియాకు తెలిపారు. ‘సున్నిత మనస్తత్వాలు కలిగిన మేమిద్దరం ఒకేసారి రాష్ గా మాట్లడడంతో ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అందుకే అలా జరిగింది. అయితే బయట ఎక్కడ కలిసినా మోహం తిప్పుకోకుండా సౌమ్యంగా పలకరించుకునేవాళ్లం. ’ అని అన్నారు. అయితే ఓ సందర్భంలో కృష్ణ ఎదురైనప్పుడు ‘ఏవండీ.. మా మహేశ్ ఓ చిన్న వేషం వేశాడు. చెల్లెలు శైలజ పాడింది. ఒకసారి రషేష్ చూద్దామా..’ అని రికార్డింగ్ థియేటర్ కు తీసుకొచ్చారు.
Also Read: వైరల్ అవుతున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీ ఫోటో గ్యాలరీ.. మీరు చూశారా?
అయితే ఒక సందర్భంలో ఇండస్ట్రీ నలిగిపోతుంది. అయితే కృష్ణ నటించిన ఓ సినిమాకు రాజ్ కోటి సంగీతం అందిస్తున్నారు. పాటలను వేటూరి సుందరరామమూర్తి రాశారు. అయితే రాజ్ కోటి గారు బాలును పాటపాడాలని అడిగారు. అప్పుడే వేటూరి వచ్చి ‘ఏమయ్యా.. పాటలు పాడితే ఏమవుంది..పాడొచ్చుగా?’ అని అన్నారు. దీంతో తాను మళ్లీ కృష్ణగారి సినిమాలకు పాటలు పాడడానికి ఒప్పుకున్నారు. కృష్ణ సినిమాలకు పాటలు పాడడానికి సుందరరామమూర్తి కారణమని బాలు చెప్పారు. ఆ సమయంలో వేటూరి మాట్లాడుతూ ‘నువ్వు పాటలు పాడుతావని కృష్ణ గారితో చెబుతాను’ అని అన్నారు. అయితే బాలు మాత్రం ‘నేనే పద్మాలయ స్టూడియోకి వెళ్లి కలుసుకుంటాను’ అని చెప్పారట. అలా ఆ తరువాత కృష్ణను కలిసిన బాలు మళ్లీ ఆయన సినిమాల్లో పాడడం మొదలుపెట్టారు.
Also Read: జయప్రద విషయంలో డైరెక్టర్ పై కృష్ణ సీరియస్ !