Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Rejected Pushpa: మహేష్ 'పుష్ప‌'ను రిజెక్ట్ చేయ‌డానికి...

Mahesh Babu Rejected Pushpa: మహేష్ ‘పుష్ప‌’ను రిజెక్ట్ చేయ‌డానికి కారణం అదే

Mahesh Babu Rejected Pushpa: సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘1 నేనొక్కడినే’ సినిమా తీశాక… దర్శకుడు సుకుమార్‌ మహేష్ కోసం మరోసారి ఈ పుష్ప కథ రాశాడు. ‘పుష్ప’ కథ మహేష్ కి చెప్పాడు కూడా. కానీ కథ మహేష్ కి నచ్చలేదు. దాంతో సుకుమార్ – మహేష్ కి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అలా మహేష్ చేయాల్సిన ‘పుష్పరాజ్‌’ పాత్రను అల్లు అర్జున్‌ చేశాడు.

Mahesh Babu Rejected Pushpa
Mahesh Babu

ముఖ్యంగా పుష్ప పాన్ ఇండియా హీరో కావాలన్న అల్లు అర్జున్ కలల్ని నెరవేర్చింది ఈ సినిమా. పైగా దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు వినిపించింది. పుష్ప హిందీ వర్షన్ ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇది ఊహించని పరిణామం. తెలుగు నేటివిటీతో తెరకెక్కిన పుష్ప హిందీలో విజయం సాధించడం కష్టమేనన్న మాట వినిపించింది. ఆ ఊహాగానాలు తలకిందులు చేస్తూ పుష్ప భారీ సక్సెస్ అందుకుంది.

Also Read: NTR New Makeover: ఎన్టీఆర్ కొత్త మేకోవర్.. లుక్ అదిరిపోతుందట

ఇక పుష్ప బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా చేయడానికి మ‌హేశ్ బాబు మొద‌ట ఒప్పుకోగా ఆ త‌ర‌వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. సుకుమార్ చెప్పిన క‌థ త‌న‌కు న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్లే మహేష్ ఈ సినిమాను రిజెక్ట్ చేశార‌ని అప్ప‌ట్లో వార్తలు వినిపించాయి. అయితే మహేశ్ బాబు ఈ సినిమాకు నో చెప్ప‌డం వెన‌క అస‌లు కార‌ణం వేరే ఉంద‌ట.

Mahesh Babu Rejected Pushpa
Pushpa Movie

మ‌హేశ్ బాబు రాజ‌మౌళి కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతుంది. పుష్ప కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తే.. రాజమౌళి సినిమా కష్టం అవుతుందని.. అందుకే మహేష్ ఈ పుష్ప సినిమాను వదులుకున్నాడు అని తెలుస్తోంది. ఏది ఏమైనా సినిమా అంటేనే మాయలోకం. ఒకరికి రావాల్సిన పేరు మరొకరికి వస్తోంది. ఒకరు చేయాల్సిన పాత్రలు మరొకరు చేస్తారు.

ఇండస్ట్రీలో మార్పులు చేర్పులు సర్వసాధారణం. అయితే, ఆ మార్పుల్లో కథలు ఉండొచ్చు, హీరోలు ఉండొచ్చు, హీరోయిన్లు ఉండొచ్చు. సహజంగా కథ రాసే సమయంలో తొలుత ఫలానా హీరో అయితే బాగుంటాడు అనిపిస్తోంది. కానీ, ఎన్నో లెక్కలు, మరెన్నో ఇగోలు.. ఇక చివరకు ఆఖరి నిమిషంలో హీరోలు మారతారు, పాత్రలు మారతాయి. అలాగే నిర్ణయాలు తారుమారవుతుంటాయి.

Also Read: Vijayendra Prasad About RRR Sequel: త్రిబుల్ ఆర్‌కు సీక్వెల్ విష‌యంపై స్పందించిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌.. ఏమ‌న్నారంటే..?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

1 COMMENT

  1. […] Allu Arjun To Grace The Pre-Release Event Of Ghani: తెలుగు చిత్రసీమలో అల్లు ఫ్యామిలీది ప్రత్యేక స్థానం. కొన్ని దశాబ్దాల నుంచి చిత్ర పరిశ్రమలో ఒక ఫ్యామిలీ ఇంత గొప్పగా సక్సెస్ అవ్వడం బహుశా అల్లు ఫ్యామిలీకి మాత్రమే దక్కిన ఘనత. అల్లు రామలింగయ్య వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్‌ బడా నిర్మాతగా నేడు తనకంటూ ఒక సామ్రాజ్యన్ని సృష్టించుకున్నారు. అలాగే, అల్లు అరవింద్ వారసులులో అల్లు అర్జున్‌ స్టార్ అయితే, అల్లు శీరీష్‌ హీరోగా రాణిస్తున్నాడు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular