Mahesh Babu Namrata relationship: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు కి చాలా మంచి క్రేజ్ ఉంది. మహేష్ బాబు ఏ సినిమా చేయాలన్నా కూడా ముందుగా నమ్రత ఆ కథ ను విని ఫైనల్ చేసిన తర్వాతే ఆ సినిమానైతే చేస్తాడు. ఇక ఇలాంటి క్రమంలోనే నమ్రత డిసిజన్స్ చాలావరకు పర్ఫెక్ట్ గా ఉంటాయని మహేష్ బాబు నమ్ముతుంటాడు. అందుకే ఆమె ఫైనల్ చేసిన కథలకి మహేష్ బాబు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే శేఖర్ కమ్ముల చేసిన ఫిదా సినిమా కథని మొదట మహేష్ బాబుకు వినిపించారట. మహేష్ బాబు ఓకే అనుకున్నప్పటికి నమ్రత అది వద్దని చెప్పిందట. దాంతో శేఖర్ కమ్ముల ఆ కథని వరుణ్ తేజ్, సాయిపల్లవి లతో చేసి సూపర్ సక్సెస్ ను సాధించాడు. శేఖర్ కమ్ముల మహేష్ బాబు తో చేయాలనుకున్న కథ ఇంకో వెర్షన్ లో ఉంటుందట.
ఇక శేఖర్ కమ్ముల చెప్పిన కథ బాగున్నప్పటికి ఆయన కథల్లో హీరోయిన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక నమ్రత కి చెప్పిన కథలో ఏదో తెలియని ఒక అసంతృప్తి ఉందని అందుకే నమ్రత ఆ కథ ను రిజెక్ట్ చేసిందట… ఆ తర్వాత అదే కథని కొంచెం మార్చి శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ సాయిపల్లవిలతో ‘ఫిదా’ సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధించాడు. మొత్తానికైతే మహేష్ బాబు ఈ కథను రిజెక్ట్ చేయడమే మంచిదైందని కొంతమంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
కారణం ఏంటి అంటే శేఖర్ కమ్ముల చేసే సినిమాల్లో హీరోలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. దానికి తోడు మహేష్ బాబు మాస్ హీరో కాబట్టి ఆయనకి శేఖర్ కమ్ముల చేసే సాప్ట్ స్టోరీస్ సెట్ అవ్వవు. అందుకే నమ్రత ఆ కథనైతే రిజెక్ట్ చేసిందట…ఇక వంశీ పైడిపల్లి చెప్పిన వారసుడు కథను కూడా ఆమె రిజెక్ట్ చేసిందట… ఇక వీళ్ళ కాంబోలో మరో సినిమా వస్తుందంటూ కొన్ని కామెంట్లు వచ్చినప్పటికీ అది కార్య రూపం దాల్చలేదు…