Jr NTR Flop Movie: చాలా యంగ్ ఏజ్‌లోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చి నూలూగు మీసాలు కూడా రాకముందే మాస్ పాలోయింగ్ తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అంత తక్కువ టైమ్ లో స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. మొదట స్టూడెంట్ నెంబర్ 1తో మొదలైన సూపర్ హిట్ ఫార్ముల.. ఆ తర్వాత ఆది, సింహాద్రి సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లను ఆయన ఖాతాలో వేశాయి.

ఆది సినిమా కంటే ముందు ఎన్టీఆర్‌కు పెద్దగా మాస్ ఫాలోయింగ్ లేదు. కానీ ఆదితో కొంత వచ్చింది. ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి మూవీ మరో లెవల్‌లో నిలబెట్టింది. ఈ మూవీతో ఎక్కడ లేని స్టార్ డమ్ వచ్చి పడింది. దీంతో యూత్ లో విపరీమైన క్రేజ్ వచ్చేసింది. దీంతో స్టార్ డైరెక్టర్ బి.బోపాల్ డైరెక్షన్లో సినిమా చేశాడు ఎన్టీఆర్.

వీరిద్దరి కాంబినేషన్ లో ంతకు ముందే అల్లరి రాముడు మూవీ వచ్చి మంచి హిట్ కొట్టింది. ఇదే నమ్మకంతో గోపాల్ తో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడు. 2005లో ఈ మూవీ తెరకెక్కింది. అప్పటికే ఎన్టీఆర్‌కు స్టార్ స్టేటస్ రావడంతో.. ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ ఈ మూవీ రిలీజ్ అయిన రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
Also Read: Jr NTR Rejected Movies: జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు.. అవి గనక చేసుంటే..?
ఈ మూవీకి నిర్మాతగా అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు చేశారు. కాగా తొలిరోజు అన్ని సెంటర్లలో సినిమా వేయలేక పోయారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తో కొన్ని చోట్ల మాత్రమే సినిమా ఆడింది. దీంతో మూవీ రిలీజ్ అయిన సెంటర్లలో ప్లాప్ టాక్ వచ్చే సరికి.. మిగతా సెంటర్ల బయ్యర్లు వద్దని పెద్ద గొడవ చేశారు. ఈ సినిమా ప్లాప్ కావడానికి పెద్ద కారణం ఉంది.
ఇందులో రొటీన్ కథతో పాటు కొత్తగా చూపించలేకపోయాడు బి. గోపాల్. అంతకు ముందు ఆయన సినిమాల కంటే ఇది చాలా వెయిట్ లేని సినిమాగా అయిపోయింది. కొన్ని సీన్లలో మోతాదుకు మించి సెంటిమెంట్ ఉండటం కూడా వర్కౌట్ కాలేదు. ఇక ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్‌కు మరో హిట్ కొట్టడానికి చాలా టైమ్ పట్టింది. ఇక నిర్మాత వెంకట్రావు అయితే ఏకంగా హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించారంటే.. ఈ మూవీ ఎంత వివాదం రేపిందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: జనసేన కోసం చిరంజీవి పని చేస్తున్నాడా.. పవన్ కోసమే ఆ సినిమా ఒప్పుకున్నాడా ?
7 Arts Sarayu First Reaction After Arrest: