Movie Trends : మూవీ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కార్తి సరసన ఆమె నటిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. అయితే అదితి హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గానూ పరిచయం అవుతుంది. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న గని చిత్రంలో రోమియో జూలియట్ అనే రొమాంటిక్ సాంగ్‌ను అదితి పాడింది. ఈ పాటను రేపు(మంగళవారం)రిలీజ్ చేయనున్నారు.

అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న KGF-2కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. అమితాబ్ బచ్చన్ షోలేలోని ‘మెహబూబా.. మెహబూబా’ పాటను రీమేక్ చేశారని, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న దానిని రిలీజ్ చేస్తారని టాక్. ఈ ఐటమ్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. హీరో యశ్ సరసన నటించినట్లు సమాచారం. ఇక ఈ మూవీ APR 14న థియేటర్లలో విడుదల కానుంది.
Also Read: ‘హుండాయ్’ కార్లను బహిష్కరించాలని ఎందుకు ఆందోళన చేస్తున్నారు..?

ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. మరో హీరోయిన్ బాడీ షేమింగ్‌కు గురైంది. నందితా శ్వేతా ఓ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ‘మీ షేప్స్ చూసుకోండి ఓసారి. ఆంటీలా అవుతున్నావ్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి నందిత ‘నేను దేవతను కాదు. ఓ సామాన్య మనిషిని. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు? నా శరీరాన్ని నేను ప్రేమిస్తా’ అని రిప్లై ఇచ్చింది.

కాగా, నందిత ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రేమకథా చిత్రం-2, అక్షర, IPC 376 సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది.
Also Read: సినిమా కంటే ట్విస్టులు.. ఈ లవ్ స్టోరీ ఎండింగ్ అదుర్స్