https://oktelugu.com/

Devi Sri Prasad-Charmi Marriage: చార్మి – దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం అతడేనా??

Devi Sri Prasad-Charmi Marriage: టాలీవుడ్ లో కేవలం గ్లామర్ షోస్ తో కెరీర్ ని లాక్కొని వస్తున్నా హీరోయిన్స్ ఉన్న ఈ కాలం లో అందం మరియు అభినయం తో విభిన్నమైన చిత్రాలు చేస్తూ టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్స్ లో ఒక్కరిగా మారారు ఛార్మి..2002 వ సంవత్సరం లో విడుదల అయినా నీ తోడు కావలి అనే సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయం అయినా ఈ అమ్మాయి అతి తక్కువ సమయం లోనే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 16, 2022 / 03:06 PM IST
    Follow us on

    Devi Sri Prasad-Charmi Marriage: టాలీవుడ్ లో కేవలం గ్లామర్ షోస్ తో కెరీర్ ని లాక్కొని వస్తున్నా హీరోయిన్స్ ఉన్న ఈ కాలం లో అందం మరియు అభినయం తో విభిన్నమైన చిత్రాలు చేస్తూ టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్స్ లో ఒక్కరిగా మారారు ఛార్మి..2002 వ సంవత్సరం లో విడుదల అయినా నీ తోడు కావలి అనే సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయం అయినా ఈ అమ్మాయి అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి దాదాపుగా 50 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది..కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ తనకంటూ ఒక్క ప్రత్యేకమైన మార్కు ని ఏర్పర్చుకుంది..అయితే 2015 వ సంవత్సరం లో ఈమె జ్యోతి లక్ష్మి అనే సినిమా చేసి ఇక హీరోయిన్ పాత్రలకు గుడ్ బాయ్ చెప్పిన ఛార్మి ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాణ రంగం లోకి అడుగు పెట్టింది..ప్రస్తుతం పూరి తో కలిసి వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఈమె గురించి సోషల్ మీడియా లో ఒక్క వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.

    Devi Sri Prasad-Charmi Marriage

    ఇక అసలు విషయానికి వస్తే అప్పట్లో ఛార్మి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తో ప్రేమాయణం జరిపింది అనే వార్త పెద్ద సంచలనం రేపిన సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్లిద్దరు అప్పట్లో కలిసి ఎన్నో నైట్ పార్టీలు మరియు ప్రైవేట్ పార్టీలకు కూడా వెళ్లేవారు,త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని వార్తలు రావడం తో అందరూ నిజమే అని అనుకున్నారు..కానీ కొన్ని రోజులు డేటింగ్ చేసిన తర్వాత వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా విడిడిపోవాల్సి వచ్చింది అట..ఆ సమయం లో ఛార్మి చాలా డిప్రెషన్ కి గురి అయినట్టు తెలుస్తుంది..అలాంటి సమయం లోనే పూరి జగన్నాథ్ గారు జ్యోతి లక్ష్మి అనే సినిమా ద్వారా ఈమెకి పరిచయం అవ్వడం..డిప్రెషన్ లో ఉన్న ఛార్మి ని ఎంతో ప్రోత్సహించి కెరీర్ పై శ్రద్ద పెట్టేలా చేసి నిర్మాణ రంగం లో ఛార్మి ని బాగా బిజీ చెయ్యడం అలా అన్ని జరిగిపోయాయి..వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరుకు నిర్మించిన సినిమాలలో ఇస్మార్ట్ శంకర్ సినిమా మినహా అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్స్ గా నిలిచాయి..దీనితో ఆర్థికంగా అటు పూరి జగన్నాథ్ ఇటు ఛార్మి బాగా దెబ్బ తిన్నారు..కానీ రెండేళ్ల క్రితం విడుదల అయినా ఇస్మార్ట్ శంకర్ సినిమా తో వచ్చిన నష్టాలు అన్ని తొలగిపొయ్యి ఎప్పుడు చూడని రేంజ్ లాభాల్లోకి వీళ్ళిద్దరిని నెట్టేసింది.

    Also Read: ‘ఆహా’లో కొత్త థ్రిల్లర్ -ట్విస్టులతో భయపెడుతున్న ‘బ్లడీ మేరీ’
    ఇది ఇలా ఉండగా ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి విజయ్ దేవరకొండ తో లైగర్ అనే సినిమా తీస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..పూరి జగన్నాథ్ ఎంతో కసి తో దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకి చేరుకుంది..ఇటీవలే విడుదల అయినా ఈ సినిమా టీజర్ కి కూడా ప్రేక్షకుల మరియు అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఒక్క తెలుగు లోనే కాకుండా హిందీ,తమిళం,మలయాళం మరియు కన్నడ బాషలలో ఈ సినిమా ఏకకాలం లో తెరకెక్కింది..ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాకి ఒక్క స్టార్ హీరో సినిమాకి ఎలాంటి మార్కెట్ అయితే ఉంటుందో అదే స్థాయి మార్కెట్ ఉండడం విశేషం..అంతటి అంచనాలను ఏర్పర్చుకున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి..ఇక ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 22 వ తారీఖున అన్ని బాషలలో ఘనంగా విడుదల చెయ్యడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    Also Read: వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి ఫిక్స్.. ప్రూఫ్ ఇదే

    Tags