https://oktelugu.com/

Heroes : ఇండస్ట్రీ లో హీరోల మధ్య నిజంగానే పోటీలు ఉంటాయా..? ఒకరిని ఒకరు తొక్కేసుకుంటారా..? అలా బలి అయిన హీరోలు ఎవరంటే..?

సినిమా అనేది చాలామందికి జీవనోపాధిని కల్పిస్తుంది. ఇక సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...

Written By: , Updated On : February 13, 2025 / 08:08 AM IST
Heroes

Heroes

Follow us on

Heroes : సినిమా అనేది చాలామందికి జీవనోపాధిని కల్పిస్తుంది. ఇక సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇండస్ట్రీలో చాలామంది గొప్ప పొజిషన్ లో ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఇక ఇలాంటి సందర్భాల్లో కొందరు సక్సెస్ అవుతూ ముందుకు సాగుతుంటే మరికొందరు మాత్రం ఫెయిల్ అవుతూ ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతుంటారు…

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లు కావాలనే ఉద్దేశ్యంతో కొంతమంది హీరోలు మంచి సబ్జెక్టులను సినిమాలుగా ఎంచుకొని వాటితో భారీ ఎక్స్పరిమెంట్లు చేసి సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల మధ్య భయంకరమైన పోటీ ఉందనే విషయం మనందరికి తెలిసిందే. ఇక బయట ఫంక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం మా మధ్య పోటీ ఏమీ లేదు అంటూ కబుర్లు చెబుతుంటారు. సినిమాల పరంగా మాత్రం హీరోల మధ్య భారీ పోటీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎవరికంటే ఎవరు టాప్ పొజిషన్ ని అందుకోవడానికి ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరినీ కాలిక్యులేట్ చేసుకుంటూ ఒక స్టార్ హీరో తను ఈ సినిమా చేయాలనేది డిసైడ్ చేసుకుంటూ ఉంటాడు… ఇక ఇలాంటి క్రమంలోనే ఎలాంటి వారసత్వ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన కొంత మంది హీరోలు స్టార్ హీరోలయ్యే రేంజ్ కు వెళ్తున్న క్రమంలో అందరూ ఒకటై ఆ యంగ్ హీరోలను తొక్కేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు.

ఇలాంటి వాళ్ల వల్లే కెరియర్ మొదట్లో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించి స్టార్ హీరో అవుతారు అనుకున్న చాలా మంది హీరోలు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో అవ్వాలంటే టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు.

అంతకుమించిన అదృష్టం తో పాటు స్టార్ హీరోలతో ఫ్రెండ్షిప్ ను కూడా చేయాల్సి ఉంటుంది. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ అనేది కొంతమంది హీరోల చేతుల్లోనే ఉందనేది వాస్తవం…ఆ హీరోల సినిమాలు వచ్చినప్పుడు టిక్కెట్ల రేట్లు పెంచడం గాని, ప్రీమియర్ షోలకు పర్మిషన్స్ ఇవ్వడం గానీ చేస్తూ ఉంటారు.

ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది అంటే ఎలాంటి ప్రీమియర్ షోస్ ఉండకపోగా వాళ్ల సినిమాలను ప్రమోట్ చేయడానికి కూడా ఏ స్టార్ హీరో ముందుకు రాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు మరింత సక్సెస్ ను సాధించి ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటే, యంగ్ హీరోలు మాత్రం ఒక సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతున్నారు…