Ravi Teja Irumudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజకి చాలా మంచి గుర్తింపు ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన మొదటిలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ అడపదడపా స్క్రీన్ మీద కనిపించిన ఆయన హీరోగా మారి ఆ తర్వాత స్టార్ హీరోగా పేరు సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు. రవితేజ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటితో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. ఇక రీసెంట్ గా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక శివ నిర్వాణ డైరెక్షన్లో చేస్తున్న ‘ఇరుముడి’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ అయ్యప్ప స్వామి మాల వేసుకొని కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మలయాళం లో వచ్చిన ఒక సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. గత సంవత్సరం మోహన్ లాల్ హీరోగా వచ్చిన ‘తుడురమ్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
తుడురమ్ సినిమాని రీమేక్ చేస్తున్నారా? లేదంటే ఆ సినిమా ఇన్స్పిరేషన్ తో ఈ సినిమాను తెరకెక్కిసున్నారా అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఆ సినిమాలో హీరో అయ్యప్ప మాల వేసుకొని ఉంటాడు. మరి ఈ సినిమాలో కూడా రవితేజ అలానే కనిపించడంతో ఆ సినిమాకి ఈ సినిమాకి మధ్య కొంత సిమిలారిటీ ఉందంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఆ సినిమా కొడుకు సెంటిమెంటుతో వచ్చింది. ఇరుముడి సినిమా కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కుతుంది.
ఇక ఈ రెండు సినిమాలకు దగ్గర సంబంధాలు ఉండడంతో సినిమా మేధావులు సైతం ఈ సినిమా తుడురమ్ ఇన్స్పిరేషన్ తో తెరకెక్కుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. రవితేజ ఈ సినిమాతో మరోసారి కొత్తగా ట్రై చేస్తున్నారని తన అభిమానులు చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…