spot_img
Homeఎంటర్టైన్మెంట్Eagle Movie First Review: ఈగిల్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఒక్క మాటతో రిజల్ట్...

Eagle Movie First Review: ఈగిల్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… ఒక్క మాటతో రిజల్ట్ చెప్పేశాడుగా!

Eagle Movie First Review: రవితేజ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేశారు. ఆ చిత్ర విజయంలో రవితేజ పాత్ర కీలకమైంది. అయితే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు నిరాశపరిచాయి. నెక్స్ట్ ఆయన ఈగిల్ మూవీతో థియేటర్స్ లో దిగుతున్నాడు. యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈగిల్ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఈగిల్ ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. ఈగిల్ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారని అర్థం అవుతుంది. రవితేజ పాత్రలో నెగిటివ్ షేడ్స్ కనిపిస్తున్నాయి. అసలు చిత్ర కథ ఏంటి అనే సస్పెన్సు కొనసాగుతోంది. రవితేజకు జంటగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటించారు. నవదీప్ మరో కీలక రోల్ చేశాడు.

ఈగిల్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. స్వయంగా హీరో రవితేజ షార్ట్ గా వన్ వర్డ్ రివ్యూ ఇచ్చేశాడు. ఈగిల్ చిత్ర ఫస్ట్ కాపీ సిద్ధం కావడంతో దర్శకుడు, నిర్మాత, చిత్ర యూనిట్ తో కలిసి ఈగిల్ చూశారు. సినిమా ముగిసి టైటిల్స్ రోల్ అవుతుండగా రవితేజ సంతోషంగా సీటు నుంచి లేచారు. దర్శకుడిని అభినందించాడు. ‘ ఐ యామ్ సూపర్ శాటిస్ఫైడ్’ అని గట్టిగా అరిచారు. చిత్ర అవుట్ ఫుట్ పట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు రవితేజ వెల్లడించాడు.

కాబట్టి ఈగిల్ సక్సెస్ పై రవితేజ పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. సినిమా చూసిన ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. ఈగిల్ మూవీ సంక్రాంతికి విడుదల కావాల్సింది. థియేటర్స్ సమస్య నేపథ్యంలో మిగతా చిత్రాల నిర్మాతలు బ్రతిమిలాడి ఈగిల్ ని వాయిదా వేయించారు. ఫిబ్రవరిలో ఈగిల్ చిత్రానికి సోలో రిలీజ్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఏది ఏమైనా రవితేజ ఈగిల్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందు వస్తున్నారు. ఈ చిత్రం అయినా ఆయనకు హిట్ ఇస్తుందేమో లేదో చూడాలి…

RELATED ARTICLES

Most Popular