Dhamaka Collections : మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘ధమాకా’ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే..రవితేజ సినిమాకి జనాలు థియేటర్స్ కి ఈ స్థాయిలో కదిలి చాలా రోజులే అయ్యింది..ఆయన లాస్ట్ హిట్ చిత్రం క్రాక్..ఆ తర్వాత ఖిలాడీ మరియు రామారావు ఆన్ డ్యూటీ వంటి సినిమాలు చేసాడు..వీటిలో ఖిలాడీ చిత్రం యావరేజి గా ఆడగా, రామారావు ఆన్ డ్యూటీ చిత్రం మాత్రం మొదటి రోజు మాట్నీస్ నుండే సర్దేసుకుంది..కెరీర్ లో వరస్ట్ పీరియడ్ ని అనుభవిస్తున్న రవితేజ కి ధమాకా చిత్రం విడుదల కి ముందు నుండే పాజిటివ్ బజ్ ని ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో కలిగించేలా చేసింది..ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు బాగా హిట్ అయ్యాయి..సోషల్ మీడియా మరియు బయట ఎక్కడ చూసిన ఈ సాంగ్స్ మారుమోగిపోయాయి..ఫలితంగా మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి..రెండవ రోజు కూడా ప్రతీ చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ దూసుకుపోయింది..రెండు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ప్రాంతం: వసూళ్లు(షేర్):
నైజం 3.72 కోట్లు
సీడెడ్ 1.34 కోట్లు
ఉత్తరాంధ్ర 1.00 కోట్లు
ఈస్ట్ 0.44 కోట్లు
వెస్ట్ 0.40 కోట్లు
నెల్లూరు 0.25 కోట్లు
గుంటూరు 0.59 కోట్లు
కృష్ణ 0.45 కోట్లు
మొత్తం 8.19 కోట్లు
ఓవర్సీస్ 0.60కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.65 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 9.44 కోట్లు
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 19 కోట్ల రూపాయలకు జరిగింది..రెండు రోజుల్లోనే దాదాపుగా పది కోట్ల రూపాయలకు దగ్గరగా వచ్చింది..మూడవ రోజు క్రిస్మస్ కావడం తో ఈరోజు కూడా మరో నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఊహించవచ్చు..అలా మూడు రోజుల్లోనే 85 శాతం రికవరీ చేసిన ఈ చిత్రం, 5 వ రోజు బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇక రవితేజ కెరీర్ అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయం లో ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ తగలడం నిజం గా ఆయన అదృష్టం అనే చెప్పొచ్చు..ఈ సినిమా తర్వాత ఆయన మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ మూవీ చేసాడు..సంక్రాంతి కానుకగా జనవరి 13 ఆ తారీఖున ఈ చిత్రం విడుదల కాబోతుంది..ఇటీవలే ఈ సినిమాలోని రవితేజ పాత్రకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా రెస్పాన్స్ అదిరిపోయింది..ఇక మెగాస్టార్ తో ఆయన కలిసి సంక్రాంతి కి ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి.