Ravichandran Ashwin and Junior NTR : సోషల్ మీడియా లో ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్(Global Star Ram Charan) ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నందమూరి, మెగా కుటుంబాల మధ్య దశాబ్దాల నుండి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ విషయం లో నువ్వా, నేనా అనే విధంగా గొడవలు ఉంటాయి అనేది మన అందరికీ తెలిసిందే. #RRR చిత్రం తర్వాత ఈ రెండు కుటుంబాలు ఒక్కటైపోతాయని అందరూ ఆశించారు. కానీ ఈ చిత్రం ఆ ఇరువురి హీరోల అభిమానుల మధ్య మరింత వైరాన్ని పెంచింది. ముఖ్యంగా ఈ చిత్రం మెయిన్ హీరో రామ్ చరణ్ అని, ఎన్టీఆర్ సైడ్ క్యారక్టర్ చేసాడని రామ్ చరణ్ అభిమానులు గత మూడేళ్ళ నుండి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అందుకు ధీటుగా ఎన్టీఆర్ అభిమానులు కూడా సమాధానం ఇస్తూ వస్తున్నారు. అయితే మరోసారి ఈ అంశం పై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోకి గాను ఆయన పెట్ట్టుకున్న థంబ్ నైల్ వివాదాస్పదంగా మారింది. ఆదిమవారం జరిగిన ఇండియా వెర్సస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ గురించి ఆయన అనలైజ్ చేస్తూ ఒక వీడియో చేసాడు. ఆ వీడియో థంబ్ నైల్ లో #RRR లోని రామ్ చరణ్ తలకు బదులు గా మన ఇండియన్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ ముఖాన్ని పెట్టగా, పాకిస్థాన్ టీం కెప్టెన్ తలకు బదులుగా ఎన్టీఆర్ ఫోటో ని మార్ఫ్ చేసాడు. దీని పై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏంటి నీ ఉద్దేశ్యం?, మా హీరోని పాకిస్థాన్ వాళ్ళతో పోలుస్తావా? , ఇది అన్యాయం వెంటనే ఈ పోస్టర్ ని మార్చాలి అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున రచ్చ చేసారు అభిమానులు.
మరో వైపు ఈ థంబ్ నైల్ పై రామ్ చరణ్ అభిమానులు ఒక రేంజ్ లో ఎన్టీఆర్ ని ట్రోల్ చేస్తున్నారు. రవిచంద్రన్ అశ్విన్ ఉద్దేశపూర్వకంగా అలా పెట్టి ఉండదు అనేది మాత్రం పక్కా. కేవలం ఆ రెండు టీమ్స్ అంత పవర్ ఫుల్ అని చెప్పడమే ఆయన ఉద్దేశ్యం అయ్యుండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే సోషల్ లో వస్తున్న ఈ ట్రోల్స్ పై రవి చంద్రన్ అశ్విన్ నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. ఆయన వరకు ఈ ట్రోల్స్ చేరి కూడా ఉండకపోవచ్చు. ఇక ఈ ఇద్దరి హీరోల సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2 ‘(War 2 Movie) మూవీ షూటింగ్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన ప్రశాంత్ నీల్(Prasanth Neel) తో మరో సినిమాని కూడా ప్రారంభించాడు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతానికి బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్న ఆయన, ఈ సినిమా పూర్తి అవ్వగానే సుకుమార్(Director Sukumar) సినిమాకు షిఫ్ట్ అవుతాడు.