
`మేము వయసుకు వచ్చాము’ వంటి మంచి చిత్రం తో తెలుగు నాట మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న దర్శకుడు నక్కిన త్రినాథ రావు. ఆ తరవాత ఆయన తీసిన ” సినిమా చూపిస్తా మామా , నేను లోకల్ , హలొ గురూ ప్రేమకోసమే ” మంచి ఎంటర్టైనర్స్ గా గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షక మన్ననలు పొందాయి. దాంతో ఇపుడు మరో ఎంటర్టైనర్ సిద్ధం చేయడం జరిగింది. కాగా ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటించనున్నాడు .
చిరంజీవి రాజకీయాలపై తమ్ముడి షాకింగ్ కామెంట్
.
నిజానికి నక్కిన త్రినాథరావు ఈ కథను వెంకటేశ్ ను దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేశాడట. కానీ కథ విన్న వెంకటేశ్ అంతగా ఆసక్తిని చూపలేదట…దాంతో నక్కిన త్రినాథరావు ఆ కథను రవితేజకు వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని తెలుస్తోంది. ఆ క్రమంలో రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా కధలో మార్పులు చేస్తున్నాడట దర్శకుడు నక్కిన త్రినాథరావు. దరిమిలా లాక్ డౌన్ ముగియగానే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించ నున్నట్టు తెలుస్తోంది..