https://oktelugu.com/

ప్రభాస్ తో పూజా రొమాంటిక్ గ్లింప్స్ !

సంక్రాంతి హడావుడి మొదలైపోవడంతో ప్రేక్షకులకు తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడానికి సన్నద్ధం అవుతున్నారు మేకర్స్. రాధేశ్యామ్’ నుండి ఓ ట్రీట్ రాబోతోందని.. అది అభిమానుల ఆకలిని తీర్చేలా ఉంటుందని.. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మొన్న ‌ అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ.. ‘మీరు అంతా కాస్త ఓపిక పట్టాలని.. సినిమా ట్రీట్ సిద్ధమవుతోందని.. అభిమానుల ఆకాంక్షలకు ఏమాత్రం తగ్గని విధంగా ట్రీట్ రాబోతుందంటూ ఓ ట్వీట్ ట్విట్టిన సంగంతి తెలిసిందే. Also Read: హరితేజ సీమంతం […]

Written By:
  • admin
  • , Updated On : January 9, 2021 / 09:45 AM IST
    Follow us on


    సంక్రాంతి హడావుడి మొదలైపోవడంతో ప్రేక్షకులకు తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడానికి సన్నద్ధం అవుతున్నారు మేకర్స్. రాధేశ్యామ్’ నుండి ఓ ట్రీట్ రాబోతోందని.. అది అభిమానుల ఆకలిని తీర్చేలా ఉంటుందని.. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మొన్న ‌ అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ.. ‘మీరు అంతా కాస్త ఓపిక పట్టాలని.. సినిమా ట్రీట్ సిద్ధమవుతోందని.. అభిమానుల ఆకాంక్షలకు ఏమాత్రం తగ్గని విధంగా ట్రీట్ రాబోతుందంటూ ఓ ట్వీట్ ట్విట్టిన సంగంతి తెలిసిందే.

    Also Read: హరితేజ సీమంతం చూడడానికి మీ రెండు కళ్లు చాలవు

    కాగా అందుకు తగ్గట్లుగానే రాధేశ్యామ్ నుంచి సంక్రాంతి సందర్భంగా ఓ చిన్న విడియో గ్లింప్స్ రాబోతోందట. కానీ, ప్రభాస్ యాక్షన్ హీరో కదా అని ఏ ఫైట్ సీక్వెన్స్ నో వుంటుందని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకుంటారు. కానీ ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ కోసమే కాకుండా.. మొత్తం ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ట్రీట్ ను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పక్కా హీరో హీరోయిన్లు ప్రభాస్-పూజా ల రొమాంటిక్ గ్లింప్స్ ను వదులుతున్నారు. అయితే సంక్రాంతి మూడు రోజుల్లో ఏ రోజు విడుదల చేస్తారనేది ఇంకా తెలియలేదు.

    Also Read: బాలయ్య అయితే ఏంటి.. నేను హీరోయిన్ !

    ఇక ఈ సినిమాని తెలుగు-హిందీ – తమిళ- కన్నడ భాషా చిత్రంగా తెర‌కెక్కించి అటు పై దేశంలోని మిగిలిన అన్ని భాష‌ల్లోనూ.. జపాన్, చైనా, రష్యా లాంటి దేశాల్లో కూడా భారీగా రిలీజ్ చేయాలని ఇప్పటికే మేకర్స్ అన్ని రకాలుగా సన్నధం అవుతున్నారు. అందుకే టీజర్ ను సంక్రాంతికే అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్