Homeఎంటర్టైన్మెంట్Ravi Teja: రూటు మార్చిన మాస్ మహరాజ్, క్లాస్ చిత్రాల దర్శకుడికి ఛాన్స్... రవితేజకు హిట్...

Ravi Teja: రూటు మార్చిన మాస్ మహరాజ్, క్లాస్ చిత్రాల దర్శకుడికి ఛాన్స్… రవితేజకు హిట్ పడేనా?

Ravi Teja: క్రాక్ మూవీతో ఫార్మ్ లోకి వచ్చిన రవితేజకు ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల రూపంలో ప్లాప్స్ పడ్డాయి. అయితే ధమాకాతో మరలా ఆయన హిట్ ట్రాక్ ఎక్కారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ధమాకా మంచి విజయం అందుకుంది. ఆ వెంటనే రవితేజకు ప్లాప్స్ పడ్డాయి. రవణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ నిరాశపరిచాయి. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ రవితేజ ఇమేజ్ ని దెబ్బ తీసింది. హరీష్ శంకర్,రవితేజ దారుణమైన సోషల్ మీడియా ట్రోల్స్ కి గురయ్యారు.

Also Read: మూగ, చెవిటి పాత్రలో పూజ హెగ్డే, ఫ్యాన్స్ జీర్ణించుకోగలరా… బ్లాక్ బస్టర్ సిరీస్ కోసం ఊహించని సాహసం

ఓ సాంగ్ లో హీరోయిన్ భాగ్యశ్రీతో రవితేజ మూమెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. దర్శకుడు హరీష్ శంకర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చూస్తుంటే రవితేజ కెరీర్ ప్రమాదంలో పడుతున్న భావన కలుగుతుంది. హిట్ పడకపోతే మార్కెట్ గల్లంతు కావడం ఖాయం. దర్శక నిర్మాతలు పక్కన పెట్టేస్తారు. రవితేజ ఎలాంటి చిత్రాలు ఎంచుకోవాలనే సందిగ్ధంలో పడ్డారు. ఈ క్రమంలో ఆయన ఓ క్లాస్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడని సమాచారం.

నేను శైలజ మూవీతో హిట్ కొట్టిన కిషోర్ తిరుమల కథను రవితేజ ఓకే చేశాడు అనేది తాజా సమాచారం. నేను శైలజ అనంతరం కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి పర్వాలేదు అనిపించుకున్నాయి. కమర్షియల్ గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక తమిళ్ రిమేక్ రెడ్ ప్లాప్ అయ్యింది. అనంతరం శర్వానంద్ హీరోగా తెరకెక్కించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సైతం నిరాశపరిచింది. చెప్పాలంటే కిషోర్ తిరుమల ప్లాప్స్ లో ఉన్నాడు. అయినప్పటికీ ఆయనకు రవితేజ అవకాశం ఇచ్చాడట.

ఈ ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన రానుందట. ప్రస్తుతం రవితేజ తన 75వ చిత్రం మాస్ జాతర లో నటిస్తున్నాడు. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా శ్రీలీల మరోసారి జంటగా నటిస్తుంది. ధమాకా చిత్రంలో శ్రీలీల-రవితేజ జతకట్టిన సంగతి తెలిసిందే. ఇక రవితేజ కెరీర్ ఎలాంటి మలుపు తిరగనుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular