Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడి’ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకుడు. అదే రవితేజకు నచ్చడం లేదు. కథ విన్నప్పుడు లేని ఇబ్బంది, సినిమా షూట్ చేసినప్పుడు లేని ఇబ్బంది.. రవితేజకు ఇప్పుడు ఎందుకు వచ్చింది ? అయినా రమేష్ వర్మ.. ఇంతకుముందు రవితేజతో ‘వీర’ అనే సినిమా కూడా తీసాడు. కాకపోతే ఆ సినిమా హిట్ కాలేదు అనుకోండి. కాకపోయినా ఖిలాడీకి రవితేజ డేట్లు ఇచ్చాడు కదా.. ఇక ఇబ్బంది ఏమి ఉంది ?

రవితేజ ఎందుకు రమేష్ వర్మ పై అసహనంగా ఉన్నాడు ? కారణాలు ఆలోచిస్తే.. చాలా విషయాలే బయటపడ్డాయి. ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ టైంలో రవితేజకి, దర్శకుడి రమేష్ వర్మకి మధ్య ఎక్కడో గ్యాప్ ఏర్పడింది అని తెలుస్తోంది.ముఖ్యంగా రమేష్ వర్మ డైరెక్షన్ పై రవితేజ చాలా అసంతృప్తిగా ఉన్నాడట. అందుకే రమేష్ వర్మ గురించి రవితేజ చాలా ఇన్ డైరెక్ట్ గా విమర్శలు చేసాడు.
Also Read: జగన్ ఇది నీకు తగునా? ప్రజలకు మూడు గంటల నరకం భావ్యమా?
ఇంతకీ రవితేజ ఏమి మాట్లాడాడు అంటే.. “నేను జాతకాన్ని అదృష్టాన్ని నమ్మను. ఓన్లీ కష్టాన్ని మాత్రమే నమ్ముతా. కష్టపడి పని చేస్తాను. ఒకశాతం అదృష్టం తోడవుతుందేమో అని ఎప్పటికీ ఫీల్ అవుతాను అని చెప్పిన రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ గురించి మాత్రం అతనికి ఎక్కడో ఎదో ఉందని.. అంటే అదృష్టం తప్ప మ్యాటర్ లేదు అన్నట్టు రవితేజ కామెంట్లు చేశాడు.
ఏమిటి ఆ కామెంట్లు అంటే.. రమేష్‌వర్మను చూస్తే జాతకం, అదృష్టం రెండూ కలిసి వచ్చాయి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాకు నిర్మాత కోనేరు సత్యనారాయణగారు అన్ని ప్రొవెడ్ చేయడమే కాకుండా మొన్ననే రమేష్ వర్మ కు కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చారు అని ఇన్ డైరెక్ట్ గా తన బాధను వ్యక్తపరుస్తూనే.. రమేష్ వర్మ మహర్జాతకుడు తప్ప మ్యాటర్ లేదు అని రవితేజ తేల్చి చెప్పాడు.

అసలు రవితేజ.. రమేష్ వర్మ గురించి మాట్లాడిన ప్రతి మాటలో కోపం, వెటకారం బాగా కనిపించాయి. కనిపిస్తే కనిపించాయి.. కానీ, రమేష్ వర్మ కష్టాన్ని కాకుండా లక్ ని నమ్ముకొని ముందుకెళ్తున్నాడని, అసలు రమేష్ వర్మలో ఎలాంటి మ్యాటర్ లేదు అని రవితేజ సెటైర్లు వేస్తూ చెప్పడమే విశేషం.
Also Read: మీడియా ముందుకు రాని పోసాని.. కారణం ఇదేనా..?