Homeఎంటర్టైన్మెంట్Ravi Teja: డైరెక్టర్ పై రవితేజ సెటైర్లు.. అతనిలో మ్యాటర్ లేదట !

Ravi Teja: డైరెక్టర్ పై రవితేజ సెటైర్లు.. అతనిలో మ్యాటర్ లేదట !

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడి’ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకుడు. అదే రవితేజకు నచ్చడం లేదు. కథ విన్నప్పుడు లేని ఇబ్బంది, సినిమా షూట్ చేసినప్పుడు లేని ఇబ్బంది.. రవితేజకు ఇప్పుడు ఎందుకు వచ్చింది ? అయినా రమేష్ వర్మ.. ఇంతకుముందు రవితేజతో ‘వీర’ అనే సినిమా కూడా తీసాడు. కాకపోతే ఆ సినిమా హిట్ కాలేదు అనుకోండి. కాకపోయినా ఖిలాడీకి రవితేజ డేట్లు ఇచ్చాడు కదా.. ఇక ఇబ్బంది ఏమి ఉంది ?

Ravi Teja
Ravi Teja

రవితేజ ఎందుకు రమేష్ వర్మ పై అసహనంగా ఉన్నాడు ? కారణాలు ఆలోచిస్తే.. చాలా విషయాలే బయటపడ్డాయి. ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ టైంలో రవితేజకి, దర్శకుడి రమేష్ వర్మకి మధ్య ఎక్కడో గ్యాప్ ఏర్పడింది అని తెలుస్తోంది.ముఖ్యంగా రమేష్ వర్మ డైరెక్షన్ పై రవితేజ చాలా అసంతృప్తిగా ఉన్నాడట. అందుకే రమేష్ వర్మ గురించి రవితేజ చాలా ఇన్ డైరెక్ట్ గా విమర్శలు చేసాడు.

Also Read: జగన్ ఇది నీకు తగునా? ప్రజలకు మూడు గంటల నరకం భావ్యమా?

ఇంతకీ రవితేజ ఏమి మాట్లాడాడు అంటే.. “నేను జాత‌కాన్ని అదృష్టాన్ని న‌మ్మ‌ను. ఓన్లీ క‌ష్టాన్ని మాత్రమే న‌మ్ముతా. కష్టపడి పని చేస్తాను. ఒక‌శాతం అదృష్టం తోడవుతుందేమో అని ఎప్పటికీ ఫీల్ అవుతాను అని చెప్పిన రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ గురించి మాత్రం అతనికి ఎక్కడో ఎదో ఉందని.. అంటే అదృష్టం తప్ప మ్యాటర్ లేదు అన్నట్టు రవితేజ కామెంట్లు చేశాడు.

ఏమిటి ఆ కామెంట్లు అంటే.. ర‌మేష్‌వ‌ర్మ‌ను చూస్తే జాత‌కం, అదృష్టం రెండూ క‌లిసి వ‌చ్చాయి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాకు నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌గారు అన్ని ప్రొవెడ్ చేయ‌డ‌మే కాకుండా మొన్న‌నే ర‌మేష్‌ వర్మ కు కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చారు అని ఇన్ డైరెక్ట్ గా తన బాధను వ్యక్తపరుస్తూనే.. ర‌మేష్ వ‌ర్మ మ‌హ‌ర్జాత‌కుడు తప్ప మ్యాటర్ లేదు అని రవితేజ తేల్చి చెప్పాడు.

Ravi Teja Khiladi Movie
Ravi Teja Khiladi Movie

అసలు రవితేజ.. రమేష్ వర్మ గురించి మాట్లాడిన ప్రతి మాటలో కోపం, వెటకారం బాగా కనిపించాయి. కనిపిస్తే కనిపించాయి.. కానీ, రమేష్ వర్మ కష్టాన్ని కాకుండా లక్ ని నమ్ముకొని ముందుకెళ్తున్నాడని, అసలు రమేష్ వర్మలో ఎలాంటి మ్యాటర్ లేదు అని రవితేజ సెటైర్లు వేస్తూ చెప్పడమే విశేషం.

Also Read: మీడియా ముందుకు రాని పోసాని.. కార‌ణం ఇదేనా..?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version