Ravi Teja Remuneration: ఒకప్పుడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Super Star Mahesh Babu), ఎన్టీఆర్(Junior NTR) లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కంటే అత్యధిక రెమ్యూనరేషన్ ని అందుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే, అది మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) మాత్రమే. ప్రభాస్(Rebel Star Prabhas), అల్లు అర్జున్(Icon Star Allu Arjun) వంటి హీరోలు రవితేజ మార్కెట్ కి దగ్గర్లో కూడా ఉండేవారు కాదు. కానీ ‘కిక్ 2’ తర్వాత రవితేజ స్టార్ స్టేటస్ కి బీటలు పడడం మొదలైంది. చిన్నగా నేటి తరం ఆడియన్స్ కి దూరం అయిపోతూ వచ్చాడు. మధ్యలో చాలా హిట్స్ పడ్డాయి కానీ, అవి రవితేజ రేంజ్ వసూళ్లు కావు అనే చెప్పాలి. వంద కోట్ల షేర్ మార్కెట్ ఉండాల్సిన రవితేజ ఇప్పుడు పది కోట్ల మార్కెట్ రేంజ్ కి పడిపోయాడు. మన కళ్ళముందే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదిగిన రవితేజ, ఇలా మార్కెట్ మొత్తాన్ని పూర్తిగా కోల్పవడం చూస్తుంటే ప్రతీ స్టార్ హీరో అభిమానికి చాలా బాధ వేస్తోంది.
‘ధమాకా’ చిత్రం తో కెరీర్ లో మొట్టమొదటి వంద కోట్ల గ్రాస్ సినిమాని అందుకున్న రవితేజ, ఆ తర్వాత వరుసగా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను అందుకున్నాడు. ఆయన గత చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కంటెంట్ పరంగా పర్వాలేదు అనే రేంజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా, పది కోట్ల రూపాయిల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విడుదలకు ముందు 20 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగింది. అంటే బయ్యర్స్ కి సాలిడ్ గా పధి కోట్ల నష్టం అన్నమాట. ఈ చిత్రానికి రవితేజ ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాక, లాభాలు వస్తేనే తీసుకుంటానని చెప్పాడట. థియేటర్స్ లో పది కోట్లు వచ్చింది, డిజిటల్, ఆడియో మరియు సాటిలైట్ రైట్స్ కలుపుకొని ఈ నిర్మాతకు లాభాలే వచ్చాయి. రవితేజ కి విడుదల తర్వాత కేవలం 4 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే ఇచ్చాడట.
2006 సమయం లోనే 7 కోట్ల రెమ్యూనరేషన్ ని అందుకొని మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ నెంబర్ 1 హీరో గా నిల్చిన రవితేజ, ఇప్పుడు 2026 సమయానికే నాలుగు కోట్ల రేంజ్ కి పడిపోవడం అనేది దురదృష్టకరం. ఇప్పుడు రవితేజ ‘ఇరుముడి'(Irumudi Movie) అనే చిత్రాన్ని చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. కానీ ఈ చిత్రానికి కూడా రవితేజ రెమ్యూనరేషన్ అందుకోవడం లేదు. విడుదల అయ్యాక లాభాలు వచ్చిన తర్వాతే రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. ఇలా ప్రతీ హీరో చేస్తే బాగుంటుంది కదూ. నిర్మాతల గురించి అలోచించి, కేవలం తన అభిమానులను మరోసారి తల ఎత్తుకునే రేంజ్ హిట్ ఇవ్వడమే రవితేజ ప్రస్తుత లక్ష్యం లాగా అనిపిస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన కం బ్యాక్ ఇస్తాడా లేదా అనేది.