https://oktelugu.com/

‘కృష్ణ’ కలయికలో సక్సెస్ కొడతారా ?

స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ కు అసలు టైం బాగాలేదు. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయింది. ప్రస్తుతం వినాయక్ తన తరువాత సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. రచయిత ఆకుల శివతో స్టోరీ మీద కూర్చున్నాడు. అయితే గత ఏడాది వినాయక్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కళ్యాణ్ ఓ సినిమాని నిర్మించటానికి ముమ్మరంగా ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పుడు వినాయక్ కి […]

Written By: , Updated On : October 3, 2020 / 04:17 PM IST
Follow us on


స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ కు అసలు టైం బాగాలేదు. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయింది. ప్రస్తుతం వినాయక్ తన తరువాత సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. రచయిత ఆకుల శివతో స్టోరీ మీద కూర్చున్నాడు. అయితే గత ఏడాది వినాయక్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కళ్యాణ్ ఓ సినిమాని నిర్మించటానికి ముమ్మరంగా ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పుడు వినాయక్ కి పరిస్థితులు పెద్దగా అనుకూలించకపోవడం, బాలయ్యకి – సి కళ్యాణ్ కి మధ్య గ్యాప్ రావడం మొత్తానికి ఆ సినిమా అలా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘విక్ర‌మ్ వేద‌’ తెలుగులో రానా – రవితేజ కాంబినేషన్ లో వినాయక్ దర్శకత్వంలో రీమేక్ అవ్వబోతుందని రూమర్స్ వచ్చినా అది నిజం కాదని తేలిపోయింది.

Also Read: బిగ్ బాస్ కు అవినాష్ ఎందుకు వెళ్లాడో చెప్పిన హైపర్ ఆది

చివరికి వినాయక్ కి మాత్రం సినిమా లేకుండా పోయింది. అయితే వినాయక్ మాత్రం మంచి ప్రాజెక్ట్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే వినాయక్ తన కథను రవితేజకు వినిపించారని.. రవితేజకు కూడా కథ బాగా నచ్చిందని.. ఈ సినిమాని త్వరలో స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక గతంలో వీరి కాంబినేషన్ లో ‘కృష్ణ’ సూపర్ హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. కృష్ణ సినిమాకు ఆకుల శివ కథ మాటలు అందించాడు. ఇప్పుడు రవితేజతో చేయబోయే సినిమాకి కూడా ఆకుల శివనే ఫుల్ స్క్రిప్ట్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి కృష్ణ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో.. ఈ సినిమా కూడా అంతే పెద్ద సక్సెస్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. మరి వారి నమ్మకానికి తగ్గట్లే… మళ్లీ ‘కృష్ణ’ కాంబినేషన్ లో హిట్ కొడతారా ? చూడాలి.