Homeఎంటర్టైన్మెంట్Ustad Bhagat Singh- Ravi Teja: 'ఉస్తాద్ భగత్ సింగ్' లో రవితేజ..? హరీష్ శంకర్...

Ustad Bhagat Singh- Ravi Teja: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో రవితేజ..? హరీష్ శంకర్ ప్లానింగ్ మామూలుగా లేదు

Ustad Bhagat Singh- Ravi Teja
ravi teja, pawan kalyan

Ustad Bhagat Singh- Ravi Teja: ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చెయ్యడానికి ఎంతలా ఎదురు చూశాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.మూడేళ్ళ క్రితమే ఆయనతో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే చిత్రాన్ని చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.కానీ సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ సరిగా లేకపోవడం తో, పవన్ కళ్యాణ్ సూచనల మేరకు కొన్ని మార్పులు చేర్పులు చేసి తమిళ సూపర్ హిట్ ‘తేరి’ మూవీ లైన్ ని తీసుకొని స్క్రిప్ట్ సిద్ధం చేసాడు.

ఫైనల్ డ్రాఫ్ట్ అద్భుతంగా రావడం తో పవన్ కళ్యాణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.అప్పుడు ఈ సినిమా టైటిల్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా మారింది.నేడే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ప్రారంభం అయ్యింది.ఇందులో పవన్ కళ్యాణ్ ప్రొఫెస్సర్ గా మరియు పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

ఇది ఇలా ఉండగా లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ చిత్రం లో రవితేజ ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తుంది.ఇటీవలే రవితేజ ని కలిసి స్టోరీ వినగా వెంటనే ఓకే చెప్పేసినట్టు సమాచారం.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.’ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కూడా అలాంటి పవర్ ఫుల్ పాత్ర పోషించబోతున్నాడట.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Ustad Bhagat Singh- Ravi Teja
ravi teja, pawan kalyan

పవన్ కళ్యాణ్ రవితేజ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చాలా బాగుంటుంది అని ఎప్పటి నుండో ఇరువురి హీరోల అభిమానులు కోరుకుంటూ ఉన్నారు.రవితేజ కూడా పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలి అనే కోరికని బయటపెట్టాడు.ఇప్పుడు చివరికి ఆ కోరిక నెరవేరబోతోంది, త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ ని వెండితెర మీద చూసి ఈలలు ఎయ్యబోతున్నాం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version