Ravi Teja Song: రవితేజ సరదా పాట బాగా వచ్చిందట !

Ravi Teja Song: పాట పాడాలి అని కోరిక ఉండాలే గాని, ఈ రోజుల్లో అది చాలా ఈజీ. అంత గొప్ప సాంకేతికత అందుబాటులో ఉంది మనకు. మంగ్లీ అనే సింగర్ నేడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ సింగర్ గా చలామణి అవుతుంది. అయితే, ఆమె వాయిస్ తో వచ్చే పాటలు ఆమె పాడిన తర్వాత నేరుగా రావు. ఆమె పాడిన తర్వాత, సాంకేతికత సాయంతో కొన్ని మార్పులు చేస్తారు. దాంతో, వాయిస్ లో కొంత […]

Written By: Shiva, Updated On : December 9, 2021 4:53 pm
Follow us on

Ravi Teja Song: పాట పాడాలి అని కోరిక ఉండాలే గాని, ఈ రోజుల్లో అది చాలా ఈజీ. అంత గొప్ప సాంకేతికత అందుబాటులో ఉంది మనకు. మంగ్లీ అనే సింగర్ నేడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ సింగర్ గా చలామణి అవుతుంది. అయితే, ఆమె వాయిస్ తో వచ్చే పాటలు ఆమె పాడిన తర్వాత నేరుగా రావు. ఆమె పాడిన తర్వాత, సాంకేతికత సాయంతో కొన్ని మార్పులు చేస్తారు.

Ravi Teja Song

దాంతో, వాయిస్ లో కొంత సరళత, శ్రావ్యత వస్తాయి. అందుకే, మంగ్లీ పాటలు బాగా సక్సెస్ అయ్యాయి. ఒక్క తెలంగాణ యాసలోనే కాకుండా.. మిగిలిన యాసల్లో కూడా ఆమె పాటలు పాడుతుంది. ఇదంతా ఎందుకు అంటే.. పాట పాడటం అనేది ఇప్పుడు పెద్ద విషయం కాదు అని చెప్పడానికే. ఇలాంటప్పుడు మ‌న హీరోల‌కు పాట‌లు పాడ‌డం ఇక లెక్క ఏమి ఉంది.

పైగా హీరోలకు ఎప్పటి నుంచో ఉన్న స‌ర‌దానే ఈ పాటలు పాడటం. ఇప్పటికే స్టార్ హీరోలంతా ఎప్పుడో ఒక‌ప్పుడు గొంతు స‌వ‌రించుకుని వచ్చి రాని రాగంలో ఏదొక రకంగా పాడి వెళ్లిన వాళ్లే. ఇదే క్రమంలో హీరో ర‌వితేజ కూడా ఇది వ‌ర‌కు గాయ‌కుడిగా తన పనితనం చూపించాడు. డిస్కోరాజా, ప‌వ‌ర్, బ‌లుపు లాంటి పలు సినిమాల్లో రవితేజ మంచి పాట‌లు పాడాడు.

Also Read: నా కూతురు రాధ గర్వపడేలా ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేయాలనుకుంటున్నాను: శ్రియా

అయితే, ఇప్పుడు మ‌రోసారి తన గొంతు స‌వ‌రించుకోవాడనికి రవితేజ బాగా ఉత్సాహం చూపిస్తున్నాడట. పైగా ఆ ఉత్సాహం చూపిస్తోంది ఏ స్టార్ డైరెక్టర్ సినిమాకో కాదు. విషయం లేని ర‌మేష్ వ‌ర్మ అనే దర్శకుడి ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న ఖిలాడీ సినిమా కోసం. ఈ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల అవుతోంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా కోసం ర‌వితేజ ఓ పాట పాడాడు.

ఈ సినిమాకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్ర‌సాద్.. ఎలాగూ దేవికి హీరోల చేత పాట పాడించడం అలవాటు. ఆ క్రమంలోనే రవితేజ కోసం ఒక పాట పాడించి ఎంజాయ్ చేశాడు. ట్యూను కూడా స‌ర‌దాగా ఉంటుంది, ఇక ర‌వితేజ గొంతులో కూడా ఎప్పుడూ సరదా ఉంటుంది. అందుకే, పాట బాగా వచ్చిందట.

Also Read: రాజమౌళి స్థూలంగా క‌థను వివరించేశాడు !

Tags