Ravi Teja: ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ… ప్రస్తుతం వరుసగా ప్లాపులు తెచ్చుకుంటూ అడపాదడపా హిట్స్ కొడుతూ కెరీర్ ను ప్రమాదంలో పడేసుకుంటున్నాడు. ఇక రవితేజ మూడు నెలలకు ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వాటిలో ఏ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కెరియర్ డైలమాలో పడిపోయింది. ప్రస్తుతం ఆయన సెక్యూర్ జోన్ లో ఉంటున్నాడు. వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తూ నాలుగైదు సినిమాలు ఫ్లాప్ అయిన కూడా ఏదో ఒక సినిమాతో సక్సెస్ ను సాధించి మరోసారి ట్రాకు లోకి వస్తున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మొత్తం మారిపోయింది. వరుసగా ప్లాప్ సినిమాలతో డీలా పడిపోయాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ‘మాస్ జాతర’ సినిమా సైతం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
రొటీన్ రొట్ట కమర్షియల్ సినిమా లాగానే ఉందని ప్రేక్షకులు దానిని ప్లాప్ చేశారు. దాంతో ఇప్పుడు ‘కిషోర్ తిరుమల’ దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తేనే ఆయన కెరియర్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది.
లేకపోతే మాత్రం చాలా వరకు ఆయన డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. తన మార్కెట్ ను కూడా కోల్పోవాల్సిన ప్రమాదం రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాతో రవితేజ సూపర్ సక్సెస్ ని సాధించాలి. లేకపోతే మాత్రం తీవ్రమైన ఇబ్బందులైతే ఎదురవుతాయి. చూడాలి మరి రవితేజ ఇకమీదట చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…
కెరియర్ స్టార్టింగ్ లో మంచి సినిమాలను చేసిన రవితేజ ఆ తర్వాత మాస్ సినిమాల వైపు అడుగులు వేశాడు. ప్రేక్షకులు తన నుంచి అదే కోరుకుంటున్నారని ఆ వైపే అడుగులు వేస్తూ వచ్చాడు. కొన్ని సందర్భాల్లో వెరైటీ సినిమాలు చేయడానికి ప్రయత్నం చేసినప్పటికి అవి ఆశించినంతగా విజయాన్ని సాధించకపోవడంతో ఆయన సైతం రొటీన్ సినిమాలు చేస్తూ వచ్చాడు…