spot_img
Homeఎంటర్టైన్మెంట్Eagle Censor Review: రవితేజ ఈగిల్ సెన్సార్ రివ్యూ... ఆ అరగంట గూస్ బంప్స్, నిడివి...

Eagle Censor Review: రవితేజ ఈగిల్ సెన్సార్ రివ్యూ… ఆ అరగంట గూస్ బంప్స్, నిడివి ఎంతంటే?

Eagle Censor Review: హీరో రవితేజ లేటెస్ట్ మూవీ ఈగిల్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించారు. ఈగిల్ ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. కాగా ఈగిల్ సెన్సార్ జరుపుకుంది. దీంతో టాక్ బయటకు వచ్చింది. సెన్సార్ సభ్యులు ఈగిల్ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అనగా 18 ఏళ్లలోపు పిల్లలు పెద్దవారి గైడెన్స్ లో చూడాలన్నమాట. కాబట్టి వైలెన్స్ పాళ్ళు ఎక్కువే ఉన్నట్లు తెలుస్తుంది.

ఈగిల్ చిత్ర నిడివి 2 గంటల 38 నిమిషాలు. ఇక సెన్సార్ సభ్యుల రిపోర్ట్ ప్రకారం ఈగిల్ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ అట. రవితేజ క్యారెక్టర్ లో షేడ్స్ మెస్మరైజ్ చేస్తాయట. ఊహించని ట్విస్ట్స్ తో అద్భుతంగా కథనం సాగుతుందట. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ గ్యారంటీ అంటున్నారు. క్లైమాక్స్ కూడా ఆకట్టుకుందని సమాచారం. మొత్తంగా రవితేజ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేయడం ఖాయం అట.

రవితేజ కూడా ఈగిల్ విజయం సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశాడు. థియేటర్లో ఫస్ట్ కాపీ చూసిన రవితేజ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ని హగ్ చేసుకుని కంగ్రాట్స్ చెప్పాడు. తాను పూర్తిగా సంతృప్తి చెందినట్లు చెప్పారు. వరుస పరాజయాల్లో ఉన్న రవితేజ ఈగిల్ తో హిట్ ట్రాక్ ఎక్కుతాడనిపిస్తుంది. ఈగిల్ లో రవితేజ నెగిటివ్ షేడ్స్ తో కూడిన రోల్ చేయడం విశేషం.

రవితేజ గత రెండు చిత్రాలు నిరాశపరిచాయి. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందుకే ఈగిల్ పై రవితేజ ఆశలు పెట్టుకున్నాడు. ఈగిల్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు కాగా… అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. నవదీప్, మధుబాల కీలక రోల్స్ చేశారు. నేడు అర్ధరాత్రి నుండే ఈగిల్ చిత్ర ప్రీమియర్స్ యూఎస్ లో ప్రదర్శించనున్నారు. ఈగిల్ చిత్రానికి డావ్ జంద్ మ్యూజిక్ అందించారు.

RELATED ARTICLES

Most Popular