రవితేజ చాలా కిందిస్థాయి నుండి వచ్చి లేటు వయసులో ఎదిగిన హీరో. అందుకే, డబ్బు దగ్గర రవితేజ నిక్కచ్చిగా ఉంటారు. రూపాయి వచ్చే చోట రెండు రూపాయిలు అడగడంలో అసలు మొహమాట పడరు. ఇలాంటి రవితేజకి ‘క్రాక్’ సినిమాతో భారీ హిట్ అందింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వచ్చాయి. మార్కెట్ పడిపోయిన టైంలో క్రాక్ లాంటి సూపర్ హిట్ రావడంతో రవితేజకి మళ్ళీ ఊపు వచ్చింది.
దాంతో ఇక తన పారితోషికంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదు ఈ సీనియర్ హీరో. క్రాక్ కి ముందు వరకు 7 కోట్లు తీసుకుని సినిమాలు చేసిన రవితేజ, ఇప్పుడు ఏకంగా 15 కోట్లు అడుగుతున్నాడు. ఒక్క హిట్ కే రెమ్యునరేషన్ ను డబుల్ చేయడం నిర్మాతలకు మింగుడు పడటం లేదు. నిజానికి దిల్ రాజు ‘ఎఫ్ 3’ సినిమాలో రవితేజ కోసం ఒక క్యారెక్టర్ రాయించాడు.
కానీ, రవితేజ ఆశ చూసి ఏ మాత్రం వర్కౌట్ కాదు అనుకున్న తరువాత, ఇక ఆ పాత్రలో కొన్ని మార్పులు చేయించి, ఆ పాత్రను సునీల్ చేత వేయిస్తున్నాడు. ఇలా దిల్ రాజు ఒక్కడే కాదు, రవితేజకు అంత పెద్ద మొత్తం ఇచ్చేందుకు పలువురు నిర్మాతలు జంకి వెనక్కి తగ్గారు. అయితే, రవితేజ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ ను నిర్మాత విశ్వప్రసాద్ (పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ) అంగీకరించారు.
ఇక కామెడీ డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు డైరెక్షన్ లో రవితేజ సినిమా మొదలు కాబోతుంది అనుకున్నారు అంతా. కానీ కట్ చేస్తే, ఇప్పుడు ఈ సినిమా కూడా డైలమాలో పడింది. 13 కోట్ల రెమ్యునరేషన్ నిర్మాత ఇస్తానని ఒప్పుకున్నా.. రవితేజ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదట.
పదిహేను కోట్లుకు రూపాయి తగ్గినా సినిమా చేయకూడదు అనే ఆలోచనలో రవితేజ ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఇక చేసేది ఏమి లేక నిర్మాత విశ్వప్రసాద్ – నక్కిన త్రినాథ రావులు కలిసి హీరో రామ్ తో కూడా చర్చలు జరుపుతున్నారు.