Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి.. ఒక రకంగా సీనియర్ హీరోలందరి కంటే చిరంజీవి ప్రస్తుతం ముందు వరుసలో ఉన్నాడు. ఆయన లాంటి హీరో ఇండస్ట్రీలో మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి చిరంజీవి ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన చేసిన ‘ మన శంకర వరప్రసాద్’ సినిమాతో గొప్ప విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… నిజానికి చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేదనే చెప్పాలి. మరి చిరంజీవిని ఆ రేంజ్ లో మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా ఏది అనే డౌట్ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది…
కెరియర్ స్టార్టింగ్ లో చిరంజీవి ఎన్ని సినిమాలు చేసిన కూడా ఖైదీ సినిమాతో అతనికి వచ్చిన మాస్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఆ సినిమాలోని పాటలు ఆయన చేస్తున్న ఫైట్లు సన్నివేశాలు అన్నీ ఆ సినిమాకు చాలా వరకు ప్లస్ అయ్యాయి.
అందువల్లే చిరంజీవికి మొదటి మాస్ ఇమేజ్ ని సంపాదించి పెట్టిన సినిమా ఖైదీ అనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవికి మొదటి బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ దక్కింది కూడా సినిమాతోనే కావడం విశేషం…మెగాస్టార్ చిరంజీవి లాంటి నటుడు ఇండస్ట్రీకి గత 50 సంవత్సరాల నుంచి ఎనలేని సేవలను చేస్తూ వస్తున్నాడు.
ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు అంటే మామూలు విషయం కాదు…ఇక ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చేయబోతున్న సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు…