Homeఎంటర్టైన్మెంట్Ravi Teja Flop Movie in OTT: ఓటీటీలోకి రాబోతున్న రవితేజ బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా...

Ravi Teja Flop Movie in OTT: ఓటీటీలోకి రాబోతున్న రవితేజ బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా !

Ravi Teja Flop Movie in OTT: మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ ‘ఖిలాడీ’. రవితేజ కథానాయకుడిగా రమేశ్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా మార్చి 11న స్ట్రీమింగ్‌ కానుంది.

Ravi Teja Flop Movie in OTT
Ravi Teja Khiladi

కాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ డిస్నీ+హాట్‌స్టార్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. అయితే, మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించినా.. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి ఇద్దరూ ఎక్స్ పోజింగ్ విషయంలో పోటీ పడినా ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. రమేష్ వర్మ దర్శకత్వం కూడా ఈ సినిమాకి బాగా మైనస్ అయింది.

Also Read: సెకండ్ ఇన్నింగ్స్ ఘనంగా మొదలుపెట్టిన ‘హాసిని’ !

ఇక ఈ సినిమా కోసం చేసిన భారీ ప్రమోషన్స్ లో.. సగం స్క్రిప్ట్ పై పెట్టినా సినిమా బెటర్ గా ఉండేది. మొత్తానికి రవితేజ ఇచ్చిన అవకాశాన్ని రమేష్ వర్మ వాడుకోలేకపోయాడు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా దారుణంగా పరాజయం పాలు అయింది. మొత్తమ్మీద ‘ఖిలాడీ’ సినిమాకి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. నిజానికి ఈ సినిమాకి రూ.22.3 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని టాక్ ఉంది.

అయితే, అది ఎంతవరకు నిజం అనేది ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి లెక్కల ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.23 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. కానీ, ఈ సినిమా అందులో సగం కూడా రాబట్టలేకపోయింది. మొత్తానికి రవితేజ ‘ఖిలాడీ’ పరిస్థితి బాక్సాఫీస్ దారుణమే అనుకోవాలి.

Also Read: రెమ్యునరేషన్ పెంచేసిన సమంత !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version