Ravi Teja Becomes Director: తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ వచ్చి పెద్ద స్టార్ అయినా వారిలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత మనకి వెంటనే గుర్తుకు వచ్చే పేరు మాస్ మహా రాజా రవితేజ..సినిమాల మీద పిచ్చి తో ఇండస్ట్రీ కి వచ్చిన రవితేజ తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టాడు..ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశి తెరకెక్కించిన అనేక సినిమాలకు రవిఒతేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు..ఆ తర్వాత చిన్న చిన్న క్యారక్టర్ రోల్స్ చేస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకున్నాడు రవితేజ..ఆయన హీరో రోల్స్ వెయ్యడానికి ఎన్నో కష్టాలు అవరోధాలు అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది..వాటి అన్నిటిని విజయవంతంగా దాటుకొని నేడు టాలీవుడ్ టాప్ స్టార్ హీరోస్ లో ఒకడిగా నిలిచాడు రవితేజ..క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు హీరో గా ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన రవితేజ ఇప్పుడు త్వరలోనే మెగా ఫోన్ పట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Janasena: ఒంటరి గానే ఎన్నికల పోరు కి జనసేన..?
ఇక అసలు విషయానికి వస్తే త్వరలోనే రవితేజ ఒక సినిమాకి దర్శకత్వం వహించబోతున్నట్టు గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి..మొదటి నుండి దర్శకత్వం డిపార్ట్మెంట్ మీద మంచి పట్టు ఉన్న రవితేజ కి ఎప్పుడైనా ఒక సినిమాకి డైరెక్షన్ చెయ్యాలనే కోరిక మిగిలి ఉందని పలు ఇంటర్వూస్ లో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..కానీ సినిమాల్లో హీరో గా ఫుల్ బిజీ గా గడుపుతూ ఉండడం తో దర్శకత్వం వహించాలని కోరిక అలానే ఉండిపోయింది అట..అయితే ఇప్పుడు ఒక తమిళ హీరో రిక్వెస్ట్ మేరకు రవితేజ త్వరలోనే ఒక సినిమా కి డైరెక్షన్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది..తమిళం లో యువ హీరోలలో మంచి కేజీ సంపాదించుకున్న నటుడు విష్ణు విశాల్ నటించబోయ్యే సినిమాకి తదుపరి సినిమాకి రవితేజ నే డైరెక్టర్ అట..విష్ణు విశాల్ తో రవితేజ కి మంచి సన్నిహిత్య సంబంధం ఉంది..ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ FIR కి రవితేజ ఒక నిర్మాతగా కూడా వ్యవహరించాడు..ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది..ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు మరియు రావణాసుర వంటి సినిమాల్లో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత ఆయన ఈ సినిమా కి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

Also Read: Pawan kalyan Next CM of AP: నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్.. ముందే చెప్పిన బ్రహ్మంగారు… నెట్టింట వైరల్
[…] […]
[…] […]