Ravi Teja: ఈ ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’తో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ మంచి ఊపుమీదున్నాడు. వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీని పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచారు మాస్ మహారాజ్. విజయం ఇచ్చే కిక్ ఎలా ఉంటుందో ప్రస్తుతం మాస్ మహా రాజా రవితేజాను చూస్తే అర్థమవుతోంది. అయితే తాజాగా రవి టేయజ తన అభిమానులకు మరో గిఫ్ట్ ను అందించనున్నాడు.
రవితేజ 70వ సినిమా అనౌన్స్మెంట్ ని ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మేరకు ‘హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్’ అనే పోస్టర్ ను సుధీర్ వర్మ విడుదల చేశాడు. ఈ చిత్రానికి ‘రావణాసుర’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం అందుతుంది. ఈ నెల 5వ తేదీన ఉదయం 10:08 నిమిషాలకి టైటిల్ పోస్టర్ తో కూడిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు.
Really Honoured to be a part of this
𝑯𝑬𝑹𝑶𝑬𝑺 𝑫𝑶𝑵’𝑻 𝑬𝑿𝑰𝑺𝑻 👤
First Look & Title of 𝑴𝒂𝒔𝒔 𝑴𝒂𝒉𝒂𝑹𝒂𝒋𝒂 @RaviTeja_offl #ℝ𝕋𝟟𝟘 on 5th NOV at 10:08 AM 🎯
Stay tuned for the 𝐌𝐚𝐡𝐚 𝐌𝐚𝐬𝐬 𝐌𝐚𝐤𝐞𝐨𝐯𝐞𝐫 🔥@SrikanthVissa @AbhishekPicture @RTTeamWorks pic.twitter.com/mjIsKF8pPC— sudheer varma (@sudheerkvarma) October 31, 2021
ప్రస్తుతం మాస్ మహారాజా రమేష్ వర్మ దర్శకత్వంలో ” ఖిలాడి ” లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. శరత్ మండవ దర్శకత్వంలో యసెల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ చిత్రంలో రవితేజ సరసన దివ్యాన్ష్ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అలానే మరోవైపు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్న ” ధమాకా” మూవీ షూటింగ్ లో కూడా రవితేజ పాల్గొంటున్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Ravi teja and sudheer varma movie update on november 5th
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com