‘Ravanasura’ Collections : ‘రావణాసుర’ మొదటి రోజు వసూళ్లు..రవితేజ మాస్ అంటే ఇదే!

‘Ravanasura’ first day collections.. : మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘రావణాసుర’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి టాక్ ని తెచ్చుకుంది.అయితే ఈ మాత్రం టాక్ చాలు రవితేజ బాక్స్ ఆఫీస్ పుల్ తో సూపర్ హిట్ చేసేస్తాడని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట.ఇందులో రవితేజ నెగటివ్ రోల్ లో ఇరగకుమ్మేసాడు, ఆయన నటన ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేసింది.కచ్చితంగా ఆయన యాక్టింగ్ కోసమైనా […]

Written By: NARESH, Updated On : April 7, 2023 8:22 pm
Follow us on

‘Ravanasura’ first day collections.. : మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘రావణాసుర’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి టాక్ ని తెచ్చుకుంది.అయితే ఈ మాత్రం టాక్ చాలు రవితేజ బాక్స్ ఆఫీస్ పుల్ తో సూపర్ హిట్ చేసేస్తాడని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట.ఇందులో రవితేజ నెగటివ్ రోల్ లో ఇరగకుమ్మేసాడు, ఆయన నటన ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేసింది.కచ్చితంగా ఆయన యాక్టింగ్ కోసమైనా ఒకసారి అందరూ చూస్తారని అంటున్నారు విశ్లేషకులు.

ఇక మొదటి రోజు ఈ చిత్రానికి అన్నీ ప్రాంతాలలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.రీసెంట్ గా విడుదలైన నాని ‘దసరా’ మూవీ రేంజ్ ఓపెనింగ్ అయితే రాలేదు కానీ, రవితేజ సినిమాలలో ఒక బెస్ట్ ఓపెనింగ్ అనే చెప్పొచ్చు.ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 22 కోట్ల రూపాయలకు జరిగింది.మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టింది..?, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఎంత వసూళ్లు రావాలి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు ఓవర్సీస్ లో ఆశించిన స్థాయి వసూళ్ళేమి రాలేదు.ప్రీమియర్స్ మరియు మొదటి రోజుకు కలిపి ఈ సినిమా అమెరికా లో లక్ష డాలర్ల లోపే వసూలు చేసిందని అంటున్నారు.కానీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో మాత్రం మంచి ఓపెనింగ్ ని దక్కించుకుంది.రవితేజ సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా డీసెంట్ స్థాయి వసూళ్లు మినిమం వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే.ఈ చిత్రానికి కూడా మొదటి రోజు సుమారుగా మూడు కోట్ల 45 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వచ్చింది అంటున్నారు విశ్లేషకులు.

ఇదే ఊపు ని వీకెండ్ మొత్తం కొనసాగిస్తే వీకెండ్ కి 12 కోట్ల రూపాయిల షేర్ వస్తుందని, ఇక బ్రేక్ ఈవెన్ కి కేవలం పది కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు.సోమవారం నుండి ఆంధ్ర ప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు అయిపోతాయి, కాబట్టి వాళ్లంతా థియేటర్స్ కి క్యూ కట్టేస్తారు, కలెక్షన్స్ పరంగా ఎలాంటి భయం అక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.