Bhagwant Kesari – Ratika Rose : బిగ్ బాస్ 7 ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ రతికా రోజ్ భగవంత్ కేసరి చిత్రంలో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె భగవంత్ కేసరి చిత్రంలో నటించిన విషయం తెలియని ప్రేక్షకులు స్క్రీన్ పై చూసి షాక్ అయ్యారు. బాలకృష్ణ లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ విడుదలైంది. ఈ మూవీ డీసెంట్ టాక్ తెచ్చుకుంది. శ్రీలీలకు తండ్రి కాని తండ్రి పాత్రలో ఆయన నటించారు. శ్రీలీల కీలక రోల్ చేసింది. కాజల్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు.
దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్యను కొత్తగా ప్రెజెంట్ చేశారన్న మాట వినిపిస్తోంది. శ్రీలీల కీలక రోల్ లో అలరించింది. అయితే బాలయ్య మార్క్ లోపించింది. ఫస్ట్ హాఫ్ తో పాటు అక్కడక్కగా బోరింగ్ గా సాగింది అంటున్నారు. సినిమాలో కామెడీ పార్ట్ వర్క్ అవుట్ కాలేదని అంటున్నారు. ఓవర్ ఆల్ గా భగవంత్ కేసరి డీసెంట్ మూవీ అంటున్నారు. పండగకు ఓ సారి చూసి ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు.
కాగా ఈ చిత్రంలో రతికా రోజ్ ఎంట్రీ థియేటర్స్ దద్దరిల్లేలా చేసింది. రతికా రోజ్ చిన్న గెస్ట్ రోల్ చేసింది. ఆమె మహిళా మంత్రిగా కనిపించి సర్ప్రైజ్ చేసింది. ఇంగ్లీష్ లో మాట్లాడే మంత్రిగా కొత్త అనుభూతిని పంచింది. రతికా రోజ్ భగవంత్ కేసరి చిత్రంలో నటించిన విషయం ఎవరికీ తెలియదు. దీంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యారు. రతికా రోజ్ సైతం తాను చిన్న పాత్ర చేస్తున్న విషయం గతంలో వెల్లడించలేదు. గతంలో రతికా రోజ్ నారప్ప, కార్తికేయ, దృశ్యం 2 చిత్రాల్లో ఆమె నటించింది.
అయితే రతికా రోజ్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు ఆమె వెల్లడించాడు. ఏకంగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో లీడింగ్ రోల్ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించింది. మరో వైపు రతికా రోజ్ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం అందుతుంది. రతికా రోల్ నాలుగో వారం ఎలిమినేట్ అయ్యింది. అయితే దామిని, రతికా రోజ్, శుభశ్రీలలో ఒకరికి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. వీరిలో హౌస్ మేట్స్ ఓట్ల ఆధారంగా రతికా రోజ్ హౌస్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.