Rashmika shocking response: అందరికీ తెలిసిన విషయాన్ని ఎంత దాచిపెట్టాలన్నా దాగదు, ఏరోజు అయినా తెలియాల్సిందే. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) జంట రిలేషన్ లో ఉన్నారు , త్వరలో పెళ్లి చేస్క్బోతున్నారు అనే విషయం ప్రతీ ఒక్కరికి తెలుసు. ఇది సీక్రెట్ కాదు, అందరికీ తెలిసిపోయింది అనే విషయం ఈ జంటకు కి కూడా తెలుసు. ఈ నెల ఉదయ్ పూర్ లో వీళ్లిద్దరి వివాహం గ్రాండ్ గా జరగబోతుంది. అందుకు విజయ్ దేవరకొండ దగ్గరుండి పెళ్లి పనులు చూసుకోవడమే కాకుండా, ప్రముఖల ఇళ్లకు వెళ్లి శుభలేఖలు ఇచ్చి మరీ ఆహ్వానిస్తున్నాడు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వీళ్లిద్దరు అధికారికంగా తమ పెళ్లి గురించి చెప్పకపోవడం పై, సోషల్ మీడియా లో నెటిజెన్స్ చిరాకు పడుతున్నారు. మీ క్రింజ్ వేషాలు ఇకనైనా ఆపండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గానే రష్మిక విమానాశ్రయం లోకి వెళ్ళినప్పుడు మీడియా రిపోర్టర్స్ మాట్లాడిన మాటలకు ఆమె ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్ కి కూడా చిరాకు కలిగించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ముంబై విమానాశ్రయం లో తారసపడిన రష్మిక ని అక్కడకి వచ్చిన కొంతమంది మీడియా రిపోర్టర్స్ చుట్టుముట్టారు. ఒక రిపోర్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపగా, అందుకు ఆమె ‘మీరు దేనికి నాకు శుభాకాంక్షలు చెప్తున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు’ అంటూ సమాధానం ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ఒకపక్క విజయ్ దేవరకొండ పెళ్లి శుభలేఖని పట్టుకొని ఊరంతా తిరుగుతుంటే, ఈ రష్మిక ఎందుకు ఇంకా దాచాలని చూస్తుంది?, దేనికైనా ఒక లిమిట్ ఉంటాది కదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే పెళ్లి తర్వాత కూడా సీక్రెట్ మైంటైన్ చేసేలా అనిపిస్తోంది. ఎందుకు వీళ్ళు తమ పెళ్లి గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించడం లేదు?, వీళ్ళని వెంటాడుతున్న భయం ఏంటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఇకపోతే రష్మిక కూడా ఈ పెళ్లి కోసమే తన చేతుల్లో ఉన్న సినిమాల షెడ్యూల్స్ అన్నిటినీ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆమె తన కాబోయే భర్త విజయ్ దేవరకొండ తో కలిసి ‘రణబలి’ అనే చిత్రం చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా రీసెంట్ గానే మీరంతా చూసే ఉంటారు. ఈ చిత్రం తో పాటు ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న రష్మిక, అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ క్యారెక్టర్ చేస్తోంది. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్న రష్మికకు ఒక రెండు నెలల పాటు సినిమాలకు సంబంధించిన ఎలాంటి షెడ్యూల్స్ లేవట. విజయ్ దేవరకొండ కూడా ఒక రెండు నెలల పాటు ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనే అవకాశాలు లేవని తెలుస్తోంది.
#RashmikaMandanna reacted with a puzzled smile, saying, “I don’t know what you’re talking about,” when the media wished her “Shaadi Mubarak” as she arrived at the airport.#FilmfareLens pic.twitter.com/hFGzOH301C
— Filmfare (@filmfare) February 16, 2026