Rashmika Vijay Relationship: తన ఫోన్ లో విజయ్ దేవరకొండ తో దిగిన ఫోటోలు దాచుకుందట రష్మిక. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని రష్మిక కామెంట్ చేసింది. రష్మిక-విజయ్ దేవరకొండ లవ్ లో ఉన్నారన్న పుకార్ల నేపథ్యంలో ఆమె పోస్ట్ ఆసక్తి రేపుతోంది.
కిరిక్ పార్టీ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన కన్నడ భామ రష్మిక(RASHMIKA MANDANNA), ఆ మూవీ హీరో రక్షిత్ శెట్టితో నెలకొన్న వివాదాల నేపథ్యంలో టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. దర్శకుడు వెంకీ కుడుముల ఛలో మూవీలో రష్మికకు ఛాన్స్ ఇచ్చాడు. నాగ శౌర్య, రష్మికల ఛలో మంచి విజయం అందుకుంది. అయితే రష్మికకు బ్రేక్ ఇచ్చిన చిత్రం మాత్రం గీత గోవిందం. విజయ్ దేవరకొండ(VIJAY DEVARAKONDA) హీరోగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కి పరశురామ్ దర్శకుడు. గీత గోవిందం సంచలన విజయం నమోదు చేసింది. నిర్మాత అల్లు అరవింద్ కి గీత గోవిందం భారీ లాభాలు పంచింది.
Also Read: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ… విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చా?
గీత గోవిందం కాంబినేషన్ డియర్ కామ్రేడ్ తో మరోసారి రిపీట్ అయ్యింది. భరత్ కమ్మ తెరకెక్కించిన డియర్ కామ్రేడ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో ఆడలేదు. విజయ్ దేవరకొండ-రష్మిక కెమిస్ట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్. ముద్దు సన్నివేశాలతో రెచ్చిపోయారు ఈ జంట. 2019 జులై 26న థియేటర్స్ లోకి వచ్చిన డియర్ కామ్రేడ్ విడుదలై 6ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా డియర్ కామ్రేడ్ జ్ఞాపకాలు రష్మిక పంచుకుంది.
డియర్ కామ్రేడ్ షూటింగ్ స్టిల్స్, సెట్ లో విజయ్ దేవరకొండతో దిగిన ఫోటోలు షేర్ చేసింది రష్మిక. అలాగే ఆసక్తికర కామెంట్స్ జోడించింది. డియర్ కామ్రేడ్ చిత్రానికి ఆరేళ్ళు. ఈ సినిమాలో ఎంతో ప్రేమ, హ్యాపీనెస్, పాజిటివిటీ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో దిగిన ఫోటోలు ఇప్పటికీ నా ఫోన్ లో ఉన్నాయి. అప్పుడప్పుడు వాటిని చూస్తూ ఉంటాను… అని రాసుకొచ్చింది. రష్మిక పోస్ట్ వైరల్ అవుతుంది. రష్మిక-విజయ్ దేవరకొండ ఎఫైర్ లో ఉన్నారనే వార్తల నేపథ్యంలో ఈ పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
కింగ్ డమ్(KINGDOM) మూవీ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ తన గర్ల్ ఫ్రెండ్ కి గత రెండు మూడేళ్లుగా సమయం కేటాయించలేదు అన్నాడు. విజయ్ దేవరకొండ ప్రస్తావించిన గర్ల్ ఫ్రెండ్ ఎవరనే సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు విజయ్ దేవరకొండతో దిగిన ఫోటోలు షేర్ చేసి, తనకు ఎంతో ప్రత్యేకం అంటుంది రష్మిక. పరోక్షంగా తమ రిలేషన్ పై హింట్ ఇస్తున్న ఈ సెలెబ్ కపుల్, సడన్ గా పెళ్లి ప్రకటన చేస్తారేమో అనే సందేహాలు ఉన్నాయి. ఈ మధ్య ఇండియాలో లివింగ్ టుగెదర్ కల్చర్ ఎక్కువైంది. పెళ్లి కి నో అంటున్న జంటలు కలిసి జీవించేందుకు ఇష్టపడుతున్నారు. ఇదే తరహా ప్రయాణం విజయ్-రష్మిక సాగిస్తున్నారా? అనే సందేహాలు లేకపోలేదు.