https://oktelugu.com/

Rashmika ‘Girl Friend’ : రష్మిక ‘గర్ల్ ఫ్రెండ్’.. ఆ కిక్కే వేరు!

ఇక అల్లు అర్జున్ కి జంటగా నటిస్తున్న పుష్ప సీక్వెల్ 2024 ఆగష్టు 15న విడుదల కానుంది.

Written By: , Updated On : October 22, 2023 / 07:26 PM IST
Follow us on

Rashmika ‘Girl Friend’ : రష్మిక మందాన స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. రైన్ బో టైటిల్ తో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న రష్మిక దసరా సందర్భంగా కొత్త మూవీ ప్రకటించింది. ఈ చిత్ర టైటిల్ గర్ల్ ఫ్రెండ్. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. గర్ల్ ఫ్రెండ్ చిత్ర టైటిల్ అండ్ కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు.

”దానిని నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అంటే… దానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఏమీ అక్కర్లేదురా. 24 హౌర్స్ పిల్ల నాతోనే ఉండాలనిపిస్తది. నాది అని చెప్పుకోవడానికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ కిక్కే వేరురా” అనే ఓ అబ్బాయి వాయిస్ ఓవర్ తో ప్రోమో మొదలైంది. చివర్లో రష్మిక నీళ్లలో ఉంది. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ స్మైల్ నుండి మెల్లగా కోపంగా మారుతుంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రేక్షకులకు ఫస్ట్ గ్లిమ్ప్స్ లోనే ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు.

చూస్తుంటే ఫీల్ గుడ్ లవ్ డ్రామా అనిపిస్తుంది. రాహుల్ రవీంద్రన్ గతంలో చిలసౌ, మన్మధుడు 2 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. చిలసౌ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో నేషనల్ అవార్డు గెలిచింది. నాగార్జునతో చేసిన మన్మధుడు 2 డిజాస్టర్. పైగా నాగార్జున ఇజ్జత్ తీసిన చిత్రం అది. గ్యాప్ తీసుకున్న రాహుల్ రవీంద్ర గర్ల్ ఫ్రెండ్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.

మరోవైపు రష్మిక పుష్ప 2, యానిమల్ వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తుంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ చిత్రంలో రన్బీర్ కపూర్ హీరో. డిసెంబర్ 1న విడుదల కానుంది. ముద్దు సన్నివేశాల్లో రష్మిక-రన్బీర్ రెచ్చిపోయారు. ఇక అల్లు అర్జున్ కి జంటగా నటిస్తున్న పుష్ప సీక్వెల్ 2024 ఆగష్టు 15న విడుదల కానుంది.

The GIRLFRIEND - Title First Look | Rashmika Mandanna | Rahul Ravindran | Hesham Abdul Wahab