https://oktelugu.com/

Rashmika : నాభి చూపిస్తూ రష్మిక మిర్రర్ సెల్ఫీ… టూ హాట్ అంటున్న నెటిజెన్స్ 

తాజాగా నాభి కనిపించేలా మిర్రర్ సెల్ఫీ దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మిర్రర్ సెల్ఫీ కోసం ట్రై చేస్తున్నానంటూ కామెంట్ పెట్టింది. రష్మిక నాటీ ఫోజ్ నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేసింది. 

Written By:
  • Shiva
  • , Updated On : July 9, 2023 / 09:07 AM IST
    Follow us on

    Rashmika : స్టార్ లేడీ రష్మిక మందాన చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె ఖాతాలో పుష్ప 2, యానిమల్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ రెండు చిత్రాల మీద భారీ అంచనాలున్నాయి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. రెడ్ శాండల్ స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ పై ఇండియా వైడ్ హైప్ ఉంది. పుష్ప 2 చిత్రానికి టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ దక్కుతాయని ట్రేడ్ వర్గాల అంచనా. 

     
    పుష్ప 2 మూవీలో రష్మిక మందాన పాత్ర చనిపోతుందనే ప్రచారం జరుగుతుంది. దీనిని ధృవీకరిస్తూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే దర్శకుడు సుకుమార్ రష్మిక పాత్ర నిడివి తగ్గించాడనే ప్రచారం జరుగుతుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ సైతం భారీ బడ్జెట్ మూవీ. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతుంది. రన్బీర్ కపూర్ లుక్ చాలా వైలెంట్ గా ఉంది. 
     
    యానిమల్ మూవీలో రష్మిక పాత్ర ఎలా ఉంటుందో అనే సస్పెన్సు కొనసాగుతోంది. ఇక రైన్ బో టైటిల్ తో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఇది సోసియో ఫాంటసీ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ అని సమాచారం. మలయాళ నటుడు మోహన్ దేవ్ రష్మికకు జంటగా నటిస్తున్నాడు. అలాగే హీరో నితిన్ తో మరోసారి జతకట్టనుంది. రష్మికకు తెలుగులో బ్రేక్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుమలతో రష్మిక ప్రాజెక్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 
     
    మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. వెంకీ కుడుములతో రష్మిక చేసిన ఛలో, భీష్మ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇది వారికి హ్యాట్రిక్ మూవీ. కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. తాజాగా నాభి కనిపించేలా మిర్రర్ సెల్ఫీ దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మిర్రర్ సెల్ఫీ కోసం ట్రై చేస్తున్నానంటూ కామెంట్ పెట్టింది. రష్మిక నాటీ ఫోజ్ నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేసింది.