Rashmika Mandanna and Deepika Padukone : కన్నడ సినీ పరిశ్రమ నుండి మన టాలీవుడ్ లోకి అడుగుపెట్టి, ఇక్కడ స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న తర్వాత ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసుకొని, పుష్ప చిత్రం తో పాన్ ఇండియన్ వైడ్ గా ఫేమ్ ని దక్కించుకొని నేషనల్ క్రష్ గా మారిపోయిన హీరోయిన్ రష్మిక మందన(Rashmika Mandanna). ప్రస్తుతం బాలీవుడ్ లో రష్మిక మేనియా ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పుష్ప, ఎనిమల్, పుష్ప 2, చావా ఇలా బాలీవుడ్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిల్చిన అన్ని సినిమాల్లోనూ ఈమెనే హీరోయిన్. ప్రతీ స్టార్ హీరో ఇప్పుడు తమ సినిమాలో రష్మిక ని హీరోయిన్ గా కావాలని కోరుకుంటున్నారు. బాలీవుడ్ పాలిట అదృష్ట దేవత గా మారిపోయింది రష్మిక. ఇకపోతే రీసెంట్ గానే ఆమె సల్మాన్ ఖాన్ తో కలిసి ‘సికిందర్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : అల్లు అర్జున్ కు స్పెషల్ గిఫ్ట్ పంపించిన రష్మిక మందన్నా… థాంక్స్ అంటున్న బన్నీ
దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం రంజాన్ కానుకగా విడుదల కానుంది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, రెండు రోజుల క్రితం ఈ చిత్రంలోని మొదటి పాటను కూడా విడుదల చేసారు. ఈ పాటకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న సల్మాన్ ఖాన్ కి రష్మిక కారణంగా సూపర్ హిట్ తగలబోతోంది అంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే, ఈ సినిమాకు రష్మిక తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఆమె ఏకంగా 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుందట. ఇప్పటి వరకు కేవలం దీపికా పదుకొనే, అలియా భట్, శ్రద్దా కపూర్, కత్రినా కైఫ్ వంటి క్రేజీ హీరోయిన్స్ మాత్రమే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకునేవాళ్ళు.
ఇప్పుడు వీళ్ళ జాబితాలోకి రష్మిక కూడా చేరిపోయింది. కల్కి సినిమాలో నటించినందుకు గాను దీపికా పదుకొనే(Deepika Padukone) 12 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుందట. ఇప్పుడు రష్మిక ఆమె కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ని అందుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సికిందర్(Sikindar Movie) సినిమా కూడా హిట్ అయితే ఇక రష్మిక రేంజ్ ఊహించడం కూడా కష్టమే. మన టాలీవుడ్ హీరోలకు ఆమె దొరకాలంటే ఏడాదికి ముందు ఆమె డేట్స్ ని లాక్ చేసుకోవాలి. త్వరలో రామ్ చరణ్(Global Star Ram Charan), సుకుమార్(Director Sukumar) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. ఒకరు సమంత కాగా, మరొకరు రష్మిక. రష్మిక కి రీసెంట్ గానే అడ్వాన్స్ ఇచ్చి ఆమె డేట్స్ ని కూడా లాక్ చేసేసుకున్నారట మేకర్స్.
Also Read : స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానిది…ఏకంగా 10 ,200 కోట్లు రాబట్టిన ఏకైక హీరోయిన్…ఎవరో ఊహించగలరా…