Rashmika Mandanna: సినిమాల్లోని ఆన్ స్క్రీన్ పై కొన్ని జంటల కెమిస్ట్రీ ని చూసిన తర్వాత కచ్చితంగా వీళ్లిద్దరు భవిష్యత్తులో ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి జంటలలో ఒకటి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) జంట. వీళ్లిద్దరు కలిసి అప్పట్లో ‘గీత గోవిందం’ చిత్రం ద్వారా తొలిసారి మన ఆడియన్స్ కి జంటగా కలిసి వెండితెరపై కనిపించారు. ఈ సినిమా మొదలైన కొత్తల్లోనే రష్మిక కి కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి తో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ ముగిసే సమయానికి వీళ్లిద్దరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది. ‘గీత గోవిందం’ సినిమా సమయంలోనే బాగా క్లోజ్ అయిన విజయ్ దేవరకొండ, రష్మిక ‘డియర్ కామ్రేడ్’ చిత్రం షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్లిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారు అనేది ఓపెన్ సీక్రెట్.
Also Read: ఓదెల 2′ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం ప్రొమోషన్స్ ఖర్చులు కూడా రాలేదు!
ఎన్నోసార్లు వీళ్లిద్దరు పరోక్షంగా అభిమానులకు హింట్స్ ఇచ్చారు. ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుంది అనేది కూడా ఓపెన్ సీక్రెట్. ‘పుష్ప 2’ ప్రీమియర్ షో కి ఆమె విజయ్ దేవరకొండ ఫ్యామిలీ తో కలిసి వచ్చింది. అప్పట్లో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. అయితే ఇన్ని సార్లు అడ్డంగా దొరికినప్పటికీ, ఎందుకు వీళ్ళు ఇంకా బహిరంగంగా మేము ప్రేమించుకుంటున్నాం, త్వరలో పెళ్లి చేసుకుంటున్నాం అనేది బయటకు చెప్పడం లేదు అనే విషయం అభిమానులకు కూడా అర్థం కావడం లేదు. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి చివరిసారిగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో ఎందుకో సినిమా రాలేదు. ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రం లో మృణాల్ ఠాకూర్ కి ముందు రష్మిక ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు కానీ, ఎందుకో అది కుదర్లేదు.
ఇదంతా పక్కన పెడితే డియర్ కామ్రేడ్ మూవీ ప్రొమోషన్స్ సమయంలో రష్మిక విజయ్ దేవరకొండ తో ఫన్నీ గా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఆమె మాట్లాడుతూ ‘చూసుకుందాం కానీ రా..కచ్చితంగా నువ్వు భవిష్యత్తులో నీ సినిమాల్లో నన్ను మిస్ అవుతావు. పో వెళ్లి వేరే సినిమాలు చేసుకో, నేను మాత్రం నీతో ఇక సినిమాలు చేయను. విజయ్ దేవరకొండ సినిమాలకు రష్మిక ఇక సంతకం చేయదు, ఇది రాసి పెట్టుకోండి’ అని రష్మిక నవ్వుతూ కామెంట్ చేసింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఫన్నీ గా తన కాళ్ళని తీసుకెళ్లి రష్మిక ఒళ్ళో పెడుతాడు. ఈ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. అయితే అప్పట్లో రష్మిక ఫన్నీ గా చెప్పిందో లేదా సీరియస్ గా చెప్పిందో అని అభిమానులు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ‘డియర్ కామ్రేడ్’ చిత్రం తర్వాత వీళ్ళు మళ్ళీ కలిసి సినిమా చేయలేదు కాబట్టి.
Also Read: రకుల్ ప్రీత్ సింగ్ టార్చర్ తట్టుకోలేక నాగార్జున అలాంటి పని చేశాడా!