Rashmika Mandanna: రష్మిక(Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girlfriend Movie) రీసెంట్ గానే విడుదలై ఈ ఏడాది సర్ప్రైజ్ హిట్స్ లో ఒకటి గా నిల్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా, బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా దాటి సేఫ్ జోన్ లోకి అడుగుపెట్టింది. వరుసగా హిట్టు మీద హిట్ కొడుతూ ముందుకెళ్తున్న గీత ఆర్ట్స్ బ్యానర్ లో మరో సూపర్ హిట్ చిత్రం గా నిల్చింది. అయితే ఈ సందర్భంగా నేడు ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ కి రష్మిక కాబోయే భర్త విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అయితే ఈ ఈవెంట్ మొదలయ్యే ముందు రష్మిక ఎంట్రీ సమయం లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఆమె ఈవెంట్ లోకి అడుగుపెట్టిన వెంటనే అభిమానులు కేరింతలు, చప్పట్లతో హోరెత్తించారు.
ఒక అభిమాని అయితే ఏకంగా ‘రష్మిక దేవరకొండ’ అని పిలిచాడు. అప్పుడు వెంటనే వెనక్కి తిరిగిన రష్మిక సిగ్గు పడుతూ చేతులు ఊపుతోంది. వీళ్ళ మధ్య ప్రేమ ఉందని, డేటింగ్ చేసుకుంటున్నారని ఎంతో కాలం నుండి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రీసెంట్ గానే వీళ్లిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు అంటూ వార్తలొచ్చాయి. వీటిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రం రష్మిక పాజిటివ్ గా రెస్పాన్స్ ఇస్తుంది. అందరికీ వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. అయినప్పటికీ ఎందుకు అధికారిక ప్రకటన చేయడం లేదు అనేది అభిమానులకు అంతు చిక్కని ప్రశ్న గా మిగిలిపోయింది. కనీసం పెళ్లి కి సంబంధించి అయినా అధికారిక ప్రకటన చేస్తారా లేదా అనేది చూడాలి. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
View this post on Instagram