Lokesh Kanagaraj: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) పేరు మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది. సందీప్ కిషన్ ని హీరో గా పెట్టి ‘నగరం’ అనే చిత్రం ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కానీ, ఆ తర్వాత భారీ గ్యాప్ తీసుకొని కార్తీ తో ‘ఖైదీ’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాతే లోకేష్ కనకరాజ్ టైం మొదలైంది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అసలు రాలేదు. ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలు సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. ఇక ఈ ఏడాది ఆయన నుండి విడుదలైన ‘కూలీ’ చిత్రం ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ప్రతీ సినిమాను అద్భుతంగా తెరకెక్కించే లోకేష్ కనకరాజ్ ఎందుకు ఈ సినిమా విషయం లో ఈ రేంజ్ లో తడబడ్డాడు అనేది విశ్లేషకులకు సైతం అంతు చిక్కలేదు. కానీ అసలు విషయం ఏమిటంటే, డైరెక్టర్ గా న్యారేషన్ విషయంలో గ్రిప్ తగ్గడానికి కారణం, లోకేష్ కనకరాజ్ ద్రుష్టి నటన వైపు వెళ్లడం వల్లే అని అంటున్నారు విశ్లేషకులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే సన్ పిక్చర్స్ సంస్థ లోకేష్ కనకరాజ్ ని హీరో గా పెట్టి DC అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించాడు. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో హీరోయిన్ గా వామిక గబ్బి నటిస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కోసం లోకేష్ కనకరాజ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది.
డైరెక్టర్ గా కొనసాగితే ఆయనకు 50 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని కూడా ఇచ్చేందుకు నిర్మాతలు క్షణం కూడా ఆలోచించరు. కానీ ఆయనకు హీరో గా ఎలాంటి మార్కెట్ లేదు. అయినప్పటికీ ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 35 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట. ఈ రేంజ్ రెమ్యూనరేషన్ మన టాలీవుడ్ ఏ సీనియర్ హీరో కానీ, మీడియం రేంజ్ హీరో కానీ అందుకోవడం లేదు. వరుస హిట్స్ కొడుతున్న నాని కూడా ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. అలాంటిది లోకేష్ కనకరాజ్ హీరో గా మొదటి సినిమాతోనే ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. చూడాలి మరి నటుడిగా ఆయన ప్రయాణం ఇకపై రెగ్యులర్ గా కొనసాగుతుందా?, లేదా ఈ ఒక్క సినిమాతోనే ఆపెస్తాడా అనేది.